Begin typing your search above and press return to search.
దీపికాతో పాటు విచారణకు హాజరవుతానని ఎన్సీబీని కోరిన రణవీర్...?
By: Tupaki Desk | 25 Sept 2020 3:00 PM ISTబాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ పెడ్లర్స్ తో దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ సంబంధాలు బయటకు రావడంతో డ్రగ్ వ్యవహారంలో దీపికా పేరు వెల్లడైంది. అంతేకాకుండా దీపికా ఆమె మేనేజర్ తో 'D' మరియు 'K' మధ్య వాట్సాప్ చాటింగ్ ద్వారా దీపికా ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉన్నట్లు ఎన్సీబీ నోటీసులు అందించింది. అప్పటికి షూటింగ్ నిమిత్తం గోవాలో ఉన్న దీపికా పదుకునే.. డ్రగ్స్ విచారణ నేపథ్యంలో నిన్న ముంబైకి చేరుకుంది. ఈ క్రమంలో నేడు ఎన్సీబీ ఎదుట దీపికా హాజరుకానుంది. అయితే దీపికాతో పాటు విచారణకు తాను కూడా హాజరవుతానని రణవీర్ సింగ్ ఎన్‌సీబీ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. దీపిక ఒక్కోసారి ఉద్వేగానికి గురవుతుందని.. అందుకే విచారణకు హాజరయ్యేందుకు తనకూ అవకాశమివ్వాలని రణవీర్ రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ నుంచి నోటీసులు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ నేడు విచారణకు హాజరైంది. ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి ఇవాళ ఉదయం ఆమె విచారణ నిమిత్తం చేరుకున్నారు. దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ను కూడా ఎన్‌సీబీ విచారిస్తోంది. ఇక ఎన్సీబీ నోటీసులు అందుకున్న సారా అలీఖాన్ - శ్రద్ధా కపూర్ లు శనివారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ సింగ్ మేనేజర్ శ్రుతి మోదీ మరియు ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాను ఎన్సీబీ విచారించింది. కాగా, యువ హీరో సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వెల్లడించిన వివరాల మేరకు టాలెంట్ సంస్థ మేనేజర్ జయా సాహాను విచారించగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.