Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న బాలీవుడ్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   4 Nov 2020 11:30 AM IST
ప్రభాస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న బాలీవుడ్‌ డైరెక్టర్‌
X
మిర్చి తర్వాత ప్రభాస్‌ బాహుబలి సినిమా చేశాడు. ఆ సినిమా రెండు పార్ట్‌ లుగా విడుదల అయిన తర్వాత దాదాపు ఆరు ఏడు నెలలు గ్యాప్‌ తీసుకున్నాడు. సాహో తర్వాత రాధేశ్యామ్‌ కు అనుకుని కొంత గ్యాప్‌, అనుకోకుండా కొంత గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చింది. రాధేశ్యామ్‌ తర్వాత ప్రభాస్‌ కు కనీసం రెండు వారాల గ్యాప్‌ కూడా లభించేలా లేదు. ఎందుకంటే డిసెంబర్‌ వరకు ప్రభాస్‌ రాధేశ్యామ్‌ షూటింగ్‌ లో పాల్గొంటాడు. ఆ వెంటనే జనవరి రెండవ లేదా మూడవ వారంలో బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంది.

ఇప్పటికే జనవరిలో షూటింగ్‌ మొదలు పెట్టేందుకు దర్శకుడు ఓం రౌత్‌ ఇతర నటీనటుల డేట్లు తీసుకున్నాడు. వారందరి డేట్లు క్లాష్‌ కాకుండా ఉండేందుకు గాను ప్రభాస్‌ వెంటనే షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆది పురుష్‌ కోసం ఏకధాటిగా ఆరు నెలల పాటు ప్రభాస్‌ షూటింగ్‌ లో పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా సమాచారం ప్రకారం గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉంటుంది కనుక మొదట వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ను చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ ఏడాది చివరి వరకు తదుపరి సీన్స్‌ ను షూట్‌ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఆది పురుష్‌ షూటింగ్‌ ఒక వైపు జరుగుతున్న సమయంలోనే మరో వైపు మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీకి ప్రభాస్‌ రెడీ అవ్వాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ లో నాగ్‌ అశ్విన్‌ సినిమా షూటింగ్‌ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. కనుక ఆది పురుష్‌ తర్వాత చిన్న గ్యాప్‌ కూడా లేకుండా నాగ్‌ అశ్విన్‌ మూవీలో చేయాల్సి ఉంది. మొత్తానికి ఇప్పటి నుండి 2021 వరకు బిజీ బిజీగానే ప్రభాస్‌ షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంటుంది.