Begin typing your search above and press return to search.

పాపం ఇల్లీ బ్యాడ్ లక్!!

By:  Tupaki Desk   |   1 Sep 2017 2:11 PM GMT
పాపం ఇల్లీ బ్యాడ్ లక్!!
X
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న టైంలోనే బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో వాలిపోయింది ఇలియానా. ఒకటి అరా ఛాన్స్ లు మాత్రమే వస్తున్నా.. ఇక్కడ స్టార్ డం కోల్పోతున్నా.. కెరీర్ ను రిస్క్ చేసి మరీ బాలీవుడ్ లో కంటిన్యూ అయిపోయింది ఈ గోవా బ్యూటీ. అయితే.. ఏళ్లు గడిచిపోతున్నా ఇప్పటివరకూ ఇలియానా యాక్టింగ్ కి పేరొచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు.

బర్ఫీ లాంటి సినిమాల క్రెడిట్ హీరో.. డైరెక్టర్ పట్టుకుపోయారు. అయినా సరే తనకంటూ ఓ మంచి రోజు వస్తుందనే కాన్ఫిడెంట్ తో కొనసాగిన ఇలియానాకు.. బాద్షాహో చిత్రం రూపంలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అజయ్ దేవగన్.. విద్యుత్ జమాల్ లాంటి హీరోలతో.. బోలెడంత స్టార్ క్యాస్ట్ ఉన్నా.. ఈ మూవీని ఇలియానా మూవీగా తేల్చేశారు బాలీవుడ్ జనాలు. అమ్మడి కేరక్టర్ కు కూడా అంతే స్థాయిలో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇల్లీ యాక్షన్ కు కూడా బోలెడంత గుర్తింపు వచ్చేసింది. ఈ పీరియాడిక్ మూవీలో నెగిటివ్ ఛాయలు ఉన్న గీతాంజలి పాత్రను అదరగొట్టేసింది ఇలియానా. అయినా ఏం లాభం లేని పరిస్థితి. ఇలియానా యాక్టింగ్ కు పేరయితే వచ్చింది కానీ.. ఈ సినిమాకు ఇప్పటికే డిజాస్టర్ టాక్ వచ్చేసింది.

అసలు ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోగా.. ఇలియానా యాక్టింగ్.. విద్యుత్ జమాల్ ఫైట్స్.. అజయ్ దేవగన్ రెండు డైలాగ్స్ తప్ప మూవీలో కంటెంట్ ఏమీ లేదని తేల్చిపారేశారు క్రిటిక్స్. లేకలేక ఒక్క సినిమాలో యాక్టింగ్ కు మంచి పేరొచ్చినా.. అది కూడా ఉపయోగం లేకపోవడం.. ఇలియానా దురదృష్టమే.