Begin typing your search above and press return to search.

పెళ్లి ప్రస్థావన ఎత్తని రొమాంటిక్‌ లవ్ బర్డ్స్‌

By:  Tupaki Desk   |   21 July 2022 2:30 AM GMT
పెళ్లి ప్రస్థావన ఎత్తని రొమాంటిక్‌ లవ్ బర్డ్స్‌
X
బాలీవుడ్ సూపర్ స్టార్‌ హృతిక్ రోషన్‌ తన సుదీర్ఘ వైవాహిక బంధం కు గుడ్ బై చెప్పేసిన విషయం తెల్సిందే. పిల్లల కోసం మాజీ భార్యతో స్నేహంగా ఉంటున్న హృతిక్‌ రోషన్ మళ్లీ ఆమెతో కలిసి పోతాడు.. ఆమెతో మళ్లీ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అది నిజం కాదని.. మళ్లీ వారిద్దరు ఒక్కటి అవ్వరని తేలిపోయింది.

ఈ సమయంలోనే హృతిక్‌ రోషన్ బాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్ సబా ఆజాద్ తో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి చక్కర్లు కొట్టడం.. ఇద్దరు పార్టీ లకు ఇంకా పబ్‌ లకు వెళ్లడం చేశారు.

అయితే మొన్నటి వరకు వీరిద్దరి మద్య ఉన్నది ఎలాంటి రిలేషన్‌ అనే విషయం పై స్పష్టత లేని సినీ జనాలు మరియు మీడియా వర్గాలకు ఇటీవలే క్లారిటీ వచ్చింది.

సబా మరియు హృతిక్‌ లు ప్రేమలో ఉన్నట్లుగా క్లారిటీ వచ్చింది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం సహ జీవనం సాగిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. హృతిక్‌ రోషన్ పిల్లలకు సబా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వారితో ప్రేమగా ఉండటం మాత్రమే కాకుండా హృతిక్‌ రోషన్ కు బెటర్ భాగస్వామిగా ఉంటుందట.

ఈ సమయంలో వీరి పెళ్లి గురించి కుటుంబ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేశారట. ప్రస్తుతానికి రిలేషన్ షిప్ కొనసాగిస్తాం. పెళ్లి గురించి ఆలోచన కాని.. ఆసక్తి కాని లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. సోషల్‌ మీడియాలో వీరి పెళ్లి గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేయడం తో ప్రస్తుతానికి అలాంటిది ఏమీ లేదు అన్నట్లుగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయిదు పదుల వయసుకు దగ్గర ఉన్న హృతిక్‌ రోషన్... ఇక ఆయనకు దాదాపుగా పదేళ్ల వయసు చిన్నదైన సబా అజాద్ ల పెళ్లికి ఇప్పటికే ఇరు వైపుల కుటుంబ సభ్యుల అంగీకారం లభించింది. అయినా కూడా కాస్త వెయిట్‌ చేసి చేసుకుందాం అన్నట్లుగా ఇద్దరు ఉన్నారట. ఇదే సమయంలో బాలీవుడ్‌ మీడియాలో పెళ్లి గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.