Begin typing your search above and press return to search.

#DRUGS ద‌ర్యాప్తు: పేక‌మేడ‌లా కూలుతున్న బాలీవుడ్!

By:  Tupaki Desk   |   27 Sept 2020 1:00 PM IST
#DRUGS ద‌ర్యాప్తు: పేక‌మేడ‌లా కూలుతున్న బాలీవుడ్!
X
సుశాంత్ మృతి కేసుతో బ‌య‌ట‌ప‌డిన డ్ర‌గ్స్ దందా బాలీవుడ్ ని పేక‌మేడ‌లా కులుస్తోందా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల‌ని బ‌ట్టి చూస్తే నిజ‌మే అనిపిస్తోంది. ఒక్కో పేరు అనూహ్యంగా ఈ కేసులో బ‌య‌టికి వ‌స్తుండ‌టంతో బాలీవుడ్ తార‌ల్లో ఉద్వేగం కట్టు తెంచుకుంటోంది. ఇన్నాళ్లుగా ఏర్పాటు చేసుకున్నఆశ‌ల సౌధం ఒక్క‌సారిగా కుప్ప‌కూలుతున్నట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఇటీవ‌ల ఎన్సీబీ ముందు హాజ‌రైన ర‌కుల్ ప్రీత్ సింగ్ విచార‌ణ అనంత‌ర ప‌రిణామాలు తెలిసిన‌దే. అయితే మీడియా క‌థ‌నాల‌పైనా ఊహాగానాల‌పైనా ర‌కుల్ దిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించ‌డం క‌ల‌క‌లం రేపింది‌.

ఇక ర‌కుల్ విచార‌ణ‌ల క్షితిజ్ అనే పేరు చెప్పార‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. దాంతో అత‌న్ని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. క్షిజిత్ ర‌వి ప్ర‌సాద్ ఇప్పుడు ఎవ‌రి పేరు చెప్ప‌బోతున్నారంటే క‌ర‌ణ్ జోహార్ పేరే అంటూ వేరొక క‌థ‌నం వెల్ల‌డించింది. త్వ‌ర‌లో క‌ర‌ణ్ కి ఎన్సీబీ నోటీసులు త‌ప్ప‌వ‌నే వార్త‌లు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. గ‌తంలో క‌ర‌ణ్ జోహార్ ఓ మిడ్ నైట్ పార్టీని కండ‌క్ట్ చేశాడు. దీనిలో దీపిక‌తో పాటు మ‌లైకా- ర‌ణ్ ‌బీర్ ‌క‌పూర్ - విక్కీ కౌష‌ల్‌- అర్జున్ క‌పూర్ ‌తో పాటు చాలా మంది సెల‌బ్రిటీలు క‌నిపించారు. ఈ వీడియోనే క‌రణ్ కొంప‌ముంచ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు కోర్టుల ప‌రిధిలో పోరాడుతుండ‌డం ఎన్.సి.బి విచారించాల‌ని కోర‌డంతో అది కీల‌కంగా మారింది.

2019లో క‌ర‌ణ్ ఇంట‌ డ్ర‌గ్స్ పార్టీ జ‌రిగింద‌ని శిరోమ‌ణి అకాలీద‌ళ్ ‌కి చెందిన మ‌జింద‌ర్ సింగ్ సిర్సా డ్ర‌గ్స్‌ ని విచ్చ‌ల‌విడిత‌నం పై కేసు ఫైల్ చేశారు. ఆ వీడియోని ఫోరెన్సిక్ టీమ్ ఆడిటింగ్ కి పంపింది. దీంతో క‌ర‌ణ్ ‌కు చిక్కులు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. క‌ర‌ణ్ తో పాటు ఎన్సీబీ రాడార్ లో 150 మంది బాలీవుడ్ సెల‌బ్రిటీల గుట్టు దాగి వుంద‌ని ధ‌ర్మ అధినేత‌ క‌ర‌ణ్ ని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని బాలీవుడ్ లో గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఈ దెబ్బ‌తో బాలీవుడ్ పేక‌మేడ‌లా కూలడం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌కులు చెబుతున్నారు.