Begin typing your search above and press return to search.
ఫేమస్ సింగర్ కి బాలీవుడ్ ఛాన్స్
By: Tupaki Desk | 19 Oct 2021 9:00 PM IST`మణికే మాగే హితే` అంటూ సోషల్ మీడియాని షేక్ చేసి..మ్యూజిక్ ప్రియుల్ని ఫిదా చేసిన శ్రీలంక గాయని..రాపర్ యొహానీడిలోకా డిసిల్వా సుపరిచితురాలే. ఒక్క పాటతో ఓవర్ నైట్ లో సోషల్ మీడియాలో క్రేజీ భామగా వెలిగిపోయింది. తన మధురమైన స్వరంతో సంగీత ప్రియుల్ని కట్టిపడేసింది. యూ ట్యూబ్ ని షేక్ చేసంది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ దిగ్గజ నటుల్ని సైతం ఆకట్టుకుంది. బిగ్ బీ అమితాబచ్చన్.. పరిణితి చోప్రా... మాధురి దీక్షిత్.. సింగ్ సోను నిగమ్ లాంటి వాళ్లు కూడా యొహానా వాయిస్ కి పడిపోయారు.
ఈ పాటకి రీమేక్ గా వచ్చిన వెర్షన్స్ కూడా శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడా క్రేజ్ తోనే యొహానీడిలోకా ఏకంగా బాలీవుడ్ ఎంట్రీనే ఇచ్చేస్తుంది. `థాంక్ గాడ్` అనే చిత్రంలో నటించే అవకాశం లభించింది. దర్శకుడు ఇంద్రకుమార్ పిలిచి మరీ ఆ ఆఫర్ ఇవ్వడం విశేషం. `థాంక్ గాడ్` లో అజయ్ దేవగణ్..సిద్ధార్థ్ మల్హోత్రా..రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లగా నటిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం గాయనికి వరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సోషల్ మీడియా మరోసారి ప్రతిభేఉ నిరూపించే వేదికగా నిలబడింది. ఎంత ట్యాలెంట్ ఉన్నానిరుపించుకునే ఓ వేదిక తప్పనిసరి. ఇంత కాలం సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడంతో ప్రతిభావంతులకు అవకాశాలు వచ్చేవి కాదు.
కానీ డిజిటల్ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక ముందుగా అక్కడ ప్రూవ్ చేసుకుని బెల్లి తెరకు ప్రమోట్ అవుతున్నారు. వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్ ముందుగా సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఆ క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ లద్వారా మరింత మంది ఔత్సాహికులు బయటపడుతోన్న సంగతి తెలిసిందే.