Begin typing your search above and press return to search.

హృతిక్ కు సపోర్టు.. కంగనను ఏం చేయలేరు

By:  Tupaki Desk   |   10 Oct 2017 11:01 AM GMT
హృతిక్ కు సపోర్టు.. కంగనను ఏం చేయలేరు
X
గత కొంత కాలంగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కంగనా రనౌత్ - హృతిక్ రోషన్ వివాదం రోజు రోజుకు మరింత వివాదంగా మారుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికపై ఇతర తారలు కూడా కంగనా కామెంట్స్ పై స్పందిస్తున్నారు. ఎక్కువగా హృతిక్ కి అందరు మద్దతుగా నిలుస్తున్నారు. అందులో ఏ మాత్రం తప్పులేదని ఆ కామెంట్స్ కి మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.

ఫర్హాన్‌ అక్తర్‌ - ట్వింకిల్‌ ఖన్నా మరియు యామి గౌతమ్‌ తో పాటు దర్శకులు నిర్మాత కరణ్‌ జోహార్‌ వంటి వారు హృతిక్ కి సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా సోనమ్‌ కపూర్‌ సోనాలి బింద్రేలు కూడా వారి స్టైల్ లో మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఫర్హాన్‌ అక్తర్‌ ఫేస్ బుక్ లో కామెంట్స్ పోస్ట్ చేసిన విధానం వైరల్ అవుతోంది. ఈ విషయం లో నాకు మాట్లాడే హక్కు లేకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో సమాజంలో చాలా మంది అమ్మాయిలు అన్యాయానికి గురవుతున్నారు. కానీ ప్రతిసారీ పురుషులదే తప్పు అనడం కరెక్ట్ కాదు. హృతిక్ ఒక అమ్మాయి విషయంలో ఆ స్థాయిలో ప్రవర్తించాడు అనేది నేను నమ్మను. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులే నిర్థారిస్తారు. కేవలం అబ్బాయిలదే తప్పు అనడం కరెక్ట్ కాదు. కంగనా అలా మీడియా ముందు ఆరోపణలు చేయడం నిజంగా దారుణం.. అన్నట్లు చెప్పాడు.

ఫర్హాన్ చేసిన ఈ కామెంట్స్ కి సోనమ్‌ - కరణ్‌ జోహార్‌ మరియు సోనాలి బింద్రే సమర్థించారు. ‘ చాలా కరెక్ట్ గా చెప్పావ్‌ ఫర్హాన్‌. ఇందుకు నిన్ను అభినందిస్తున్నాను’ అని వారు ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే ఈ తరహా కామెంట్స్ ని ఎప్పటిలానే కంగనా చెల్లెలు రంగోలి కొట్టి పారేసింది. డియర్‌ ఫర్హాన్‌.. మీరు కేవలం రోషన్ ఫ్యామిలీకి సపోర్ట్‌ చేస్తూ ఈ పోస్ట్‌ రాశారు.. ఆలా రాయకుండా ఉండి ఉంటే తప్పకుండా అభినందించే దాన్ని. మళ్లీ చెబుతున్నా.. చిత్రపరిశ్రమ మొత్తం కంగనా కి వ్యతిరేకంగా ఉన్నా సమర్థవంతంగా తన స్థానాన్ని నిలుపుకోగలదని కౌంటర్ వేశారు.