Begin typing your search above and press return to search.

అసలు ఏం చెప్తున్నారు బాసూ??

By:  Tupaki Desk   |   22 Jan 2016 11:00 PM IST
అసలు ఏం చెప్తున్నారు బాసూ??
X
బాలీవుడ్ లో విడిపోయే కేసులు పెరిగిపోతున్నాయి. లవర్స్ - పెళ్లి చేసుకోబోయే వాళ్లు, చేసుకున్న వాళ్లే కాదు.. ఎన్నో ఏళ్ల తర్వాత కూడా విడిపోతున్నారు. రణ్ బీర్ కపూర్-కత్రినా కైఫ్ లు లవర్స్ గా విడిపోతే, ఏళ్ల తరబడి బంధానికి విడాకులు ఇచ్చేశాడు హ్రితిక్. కోర్టుకెక్కి కొట్టుకుంటున్నారు కరిష్మా కపూర్ ఆమె భర్త. డైరక్టర్‌ ఫరాన్ అక్తర్ - అధునాల జంట.. పదిహేను ఏళ్లకి విడాకులు అంటూ నిన్నే బాంబ్‌ పేల్చారు.

ఒక ప్రక్కన 70వ ఒడిలోకి అడుగుపెట్టి కూడా.. యాక్టర్‌ కబీర్‌ బేడి మొన్ననే ఒక 40 ఏళ్ల లేడీని పెళ్లాడేశాడు. అలాంటప్పుడు 40+ అయిన ఈ స్టార్లెందుకు ఇలా విడిపోతున్నారు అనే సందేహం రాక మానదు. అయితే ఇన్నేళ్లు కలిసున్నారు కాబట్టి.. వీళ్లకు దాంపత్య జీవనం బోర్‌ కొట్టేసిందా? లేకపోతే ఇన్నేళ్లు ఒక్కరే పార్టనర్‌ అంటే మనస్సు ఒప్పుకోవట్లేదా? ఈ మాటను వీళ్లనే ఎందుకు అడగాల్సి వస్తోందంటే.. సినిమాల్లోనేమో ప్రేమ స్వచ్ఛమైనది.. పవిత్రమైనది.. బీభత్సం.. బంపర్‌ బొనాంజా.. అంటూ చూపించేసి.. రియల్‌ లైఫ్‌ లో మాత్రం ఇలా విడాకులూ పెటాకులూ అంటూ డ్యాన్సింగులు చేస్తే.. మరి వీళ్ళు సొసైటీకి చెబుతోంది ఏంటి? చేస్తోంది ఏంటి?