Begin typing your search above and press return to search.

బాలీవుడ్ తారల న్యూ ఇయర్ స్పాట్స్

By:  Tupaki Desk   |   29 Dec 2015 10:30 PM GMT
బాలీవుడ్ తారల న్యూ ఇయర్ స్పాట్స్
X
హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తోంది. జనాలు కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. జనాల సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉంటే.. బాలీవుడ్ స్టార్స్ వేడుకలు మరో రేంజ్ లో ఉంటాయి. తమ స్థాయికి, టేస్ట్ కి తగినట్లుగా న్యూ ఇయర్ ను హ్యాపీగా చేసేందుకు.. బాలీవుడ్ తారలు ఇలా ప్లాన్స్ వేసుకున్నారు.

దిల్ వాలేకు నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ సునామీ కంటిన్యూ చేస్తున్న షారూక్ ఖాన్.. తన ఫ్యామిలీ, బంధువులతో కలిసి దుబాయ్ వెళ్తున్నాడు. సల్మాన్ ఖాన్ - హ్రితిక్ రోషన్ - శ్రీదేవి - అనిల్ కపూర్ - సోనమ్ కపూర్ లు కూడా.. దుబాయ్ టికెట్సే కొన్నారు. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ జంట మాత్రం.. ప్రతీసారి లాగానే స్విట్లర్లాండ్ వెళ్లనుండగా.. రణ్ బీర్ కపూర్ -కత్రినా కైఫ్ లు లండన్ రోడ్లను సెలెక్ట్ చేసుకున్నారు. అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను న్యూయార్క్ లో సెలబ్రేట్ చేసుకోనున్నాడు.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అయితే.. తన బర్త్ డే అయిన జనవరి 5 వరకూ ఏదో ఓ బీచ్ సిటీ చెక్కేస్తానని చెబ్తోంది. ప్రియాంక చోప్రా మాత్రం యాజ్ యూజువల్ గా ఫ్యామిలీతో కలిసి గోవాలో క్యాంప్ పెట్టేయనుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే.. మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రోడ్లను చుట్టేస్తున్నాడు.