Begin typing your search above and press return to search.
ప్చ్.. మాకు రాజమౌళి లాంటోడు లేడు
By: Tupaki Desk | 16 July 2015 9:51 PM ISTబాహుబలి 200కోట్ల వసూళ్లను అధిగమించి 300కోట్ల క్లబ్‌లో చేరబోతోంది. భారతదేశంలోనే ఓ ప్రాంతీయ భాషా చిత్రం ఈ రేంజులో సంచలనం సృష్టించడం చాలామంది జీర్ణించుకోలేని విషయం. ఓ తెలుగు దర్శకుడు ఈ రేంజు ఫీట్ వేయడం అసాధారణం అంటూ ప్రశంసలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి పెర్ఫెక్షన్ గురించి, పనితనం గురించి పాజిటివ్‌గా, నెగెటివ్‌గా కొన్ని కామెంట్లు బాలీవుడ్ నుంచి వినిపించాయి. బాలీవుడ్ ప్రముఖులు ఏమన్నారంటే... ?
ప్రీతీష్ నంది (నిర్మాత):
ఈ టైపు జోనర్ బాలీవుడ్‌లో తెరకెక్కలేదు. అలాంటివి ఇక్కడ తీసినా విజయం సాధించవు. అంతేకాదు బాహుబలి హిందీ వెర్షన్ వసూళ్లు అంత గొప్పగా ఏం లేవు. ఇది దర్శకుని పనితనం అనలేం. అదంతా విఎఫ్‌ఎక్స్ మహిమ. రాజమౌళి సాంకేతికతను అర్థం చేసుకుని పరిమిత బడ్జెట్‌లో దీన్ని సాధించుకోగలిగాడు. ఇలాంటివి తీయడానికి కేవలం విజన్, ఫ్యాషన్ ఉంటే సరిపోవు. అనుకున్న విధంగా విజువల్స్‌ని చూపించగలగాలి. అది రాజమౌళి చేసి చూపించాడు. బాలీవుడ్ బడ్జెట్‌లలో తీస్తే ఇలాంటివి ఎఫర్డబుల్ కావు.
అనుభవ్ సిన్హా (దర్శకుడు)
రాజమౌళి పాషనేట్ డైరెక్టర్. అతడు ఫాంటసీ, ఇమాజినేషన్ అద్భుతం. మగధీ, ఈగ .. ఇప్పుడు బాహుబలితో అతడి సత్తా ఏంటో తెలిసొచ్చింది. రా-1, ఐ చిత్రాల్లో 'బాహుబలి' కోసం చేసినదాంట్లో సగమైనా చేయలేకపోయారు.
నీతా లుల్లా (స్టయిలిష్ట్):
రాజమౌళి తర్వాత అంతటివాళ్లు ఎవరున్నారు? అంటే అశుతోష్ గోవారికర్, సంజయ్ లీలా భన్సాలీ పేర్లను గుర్తు చేస్తోంది ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. అనుకున్నది చేసి చూపించడం కోసం ఎంతకైనా తెగించే బాపతు వీళ్లిద్దరూ అని చెబుతోంది. ఒక్కోసారి ఫ్యాషన్ బొటిక్‌ని వేకువ ఝాము 2.30కే తెరవాల్సి వచ్చేదని సెలవిచ్చింది. ఒక్కోసారి తెల్లవారుఝామున నిద్రలేచి మార్పులకు తగ్గట్టే చీరల్ని, ఆభరణాల్ని డిజైన్ చేసి ఇవ్వాల్సి వచ్చేదని చెప్పారు. జోధా అక్భర్ వంటి సినిమా కోసం అలా చేయల్సొచ్చిందని చెప్పారు.
ఒమంగ్ కుమార్ (దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్):
రాజమౌళి పెర్ఫెక్షనిస్ట్. ఆ సంగతి బాహుబలి చూస్తే తెలుస్తుంది. అయితే అతడిలానే సంజయ్‌లీలా భన్సాలీ, సుభాష్ ఘాయ్ అన్ని విషయాల్లో పెర్ఫెక్ట్‌గా ఉంటారు. భారీ కాన్వాసుతో ప్రాజెక్టు చేపట్టినా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా జాగ్రత్త పడుతుంటారు. నేను బ్లాక్ సినిమాకి పనిచేసినప్పుడు సంజయ్‌లీలాతో బోలెడన్ని అనుభవాలు. ఎక్కడో వెనుకవైపు రోలో డ్యాన్సర్ సరిగా లేకపోయినా జాగ్రత్తగా సర్ధేస్తారు. రిపీట్ చేయిస్తారు.అ ంత కమిట్‌మెంట్ అతడిది. రాజమౌళి అంత పెర్ఫెక్షనిస్ట్ అన్నది నా అభిప్రాయం.