Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ పై విమర్శలే కాదు ఆయనకు మద్దతు కూడా!

By:  Tupaki Desk   |   5 Oct 2021 4:00 PM IST
సూపర్‌ స్టార్‌ పై విమర్శలే కాదు ఆయనకు మద్దతు కూడా!
X
బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్.. సూపర్‌ స్టార్ షారుఖ్‌ ఖాన్‌ తనయుడు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. పోలీసుల రిమాండ్‌ లో ఉన్న షారుఖ్‌ తనయుడ ఆర్యన్ ఖాన్‌ గురించి గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఆర్యన్‌ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లుగా కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నా కూడా షారుఖ్‌ ఏం చేస్తున్నాడు అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఒకానొక సమయంలో తన పిల్లలకు పూర్తి స్వేచ్చను ఇస్తాను. వారు ఏం చేసినా కూడా నేను ఏమీ అనను అంటూ ఇంటర్వ్యూలో షారుఖ్‌ చెప్పాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతగా నీవు నీ కొడుకుకు లీనియన్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగింది అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు.

ఆర్యన్‌ విషయంలో షారుఖ్‌ ఖాన్‌ ను విమర్శిస్తున్న వారు పెద్ద ఎత్తున ఉన్నారు. ఆయన తీరును తప్పుబడుతున్న వారు మాత్రమే కాకుండా కొందరు మద్దతు పలుకుతున్న వారు కూడా ఉన్నారు. షారుఖ్‌ ను సపోర్ట్‌ చేస్తూ వి సపోర్ట్‌ షారుఖ్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ కాలంలో ఇవన్ని చాలా కామన్‌ విషయాలు. పిల్లల తప్పులకు తల్లిదండ్రులను బాధ్యులను చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. ఆర్యన్ ఏమీ చిన్న పిల్లాడు కాదు. అతడు తన జీవితాన్ని తానే స్వయంగా నడుపుకోగల వయసు వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తప్పు చేశాడు అంటే అది పూర్తిగా అతడి తప్పే. ఆ తప్పును షారుఖ్‌ ఏమీ ప్రోత్సహించలేదు కనుక ఇక్కడ షారుఖ్ ను తప్పుబట్టడానికి ఏమీ లేదు అంటూ కొందరు మద్దతు తెలుపుతున్నారు.

బాలీవుడ్‌ కు చెందిన పలువురు ప్రముఖులు షారుఖ్‌ ఇంటికి వెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. కొడుకు జైలుకు వెళ్లి దుఃఖం లో ఉన్న సహచరుడు షారుఖ్‌ ఖాన్‌ ను సల్మాన్ ఖాన్‌ పరామర్శించాడు. షారుఖ్‌ ఖాన్ కు సల్మాన్‌ వెళ్లి ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంకా కొందరు ప్రముఖులు కూడా షారుఖ్‌ ఖాన్‌ ను పరామర్శించారు. మరో వైపు షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ను బయటకు తీసుకు వచ్చేందుకు చాలా మంది పని చేస్తున్నారు. కోర్టు వరకు అప్పుడే తీసుకు వెళ్లి రిమాండ్‌ విధించడం వల్ల కాస్త ఆలస్యం అవుతుందని.. ఆర్యన్‌ విడుదల విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. షారుఖ్‌ కు ఉన్న స్టార్‌ డమ్‌ నేపథ్యంలో ఆర్యన్ అసలు అరెస్ట్‌ అవ్వకుండానే ఉండాలి. కాని ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరిగిందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.