Begin typing your search above and press return to search.

'లైగర్‌'కు బాలీవుడ్ 'బాయ్ కాట్' ఫీవ‌ర్‌!

By:  Tupaki Desk   |   20 Aug 2022 6:32 AM GMT
లైగర్‌కు బాలీవుడ్ బాయ్ కాట్ ఫీవ‌ర్‌!
X
బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత నుంచి హిందీ సినిమాలపై బాయ్ కాట్ ట్రెండ్ న‌డుస్తోంది. బాలీవుడ్ లో ఏ సినిమా విడుద‌లైనా స‌రే దాన్ని బాయ్ కాట్ చేయిండి అంటూ నెట్టింట ట్రోలింగ్ న‌డుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్ గా విడుద‌లైన అమీర్ ఖాన్ సినిమా 'లాల్ సంగ్ చ‌డ్డా'పై కూడా ఇదే బాయ్ కాట్ ట్రెండ్ తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది. సినిమా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఈ ట్రెండ్ మ‌రింత‌గా సినిమాని కిల్ చేసింది.

ఇప్పుడు ఇదే బాయ్ కాట్ ఫీవ‌ర్ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మిక్స్డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ యాక్ష‌న‌ప్ ఎంట‌ర్ టైన‌ర్‌ 'లైగ‌ర్‌' ని చుట్టుకుంటోంది. పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కూడా ఈ మూవీపైనే భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రో 5 రోజుల్లో సినిమా ప్ర‌సంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి ఐదు భాష‌ల్లో విడుద‌ల కానున్న నేప‌థ్యంలో నెట్టింట #BoycottLigerMovie అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతుండ‌టం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మూవీని నెటిజ‌న్స్ #BoycottLigerMovie అంటూ ట్రెండ్ చేయ‌డానికి కార‌ణం క‌ర‌ణ్ జోహార్‌, అన‌న్యా పాండే అని తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన క‌ర‌ణ్ జోహార్ ఈ మూవీకి వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. అంతే కాకుండా అన‌న్య పాండే ఇందులో హీరోయిన్ గా న‌టించింది. త‌ను డ్రిగ్ అడిక్ట‌ర్ అంటూ ఈ ఇద్ద‌రు ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు కాబ‌ట్టి ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ కొంత మంది నెటిజ‌న్స్ నెట్టింట #BoycottLigerMovie హ్యాష్ ట్యాగ్ తో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

దీంతో #BoycottLigerMovie ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ అవుతోంది. అయితే దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కూడా గ‌ట్టి బ‌దులిస్తూ #UnstoppableLIGER అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం నెట్టింట్లో #UnstoppableLIGER కూడా ట్రెండ్ అవుతోంది. ఇదిలా వుంటే బాయ్ కాట్తా వివాదంపై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించారు. ఇటీవ‌ల 'లైగ‌ర్‌' ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ మీడియాతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే మాట్లాడారు. ముందుగా బాయ్ కాట్ వివాదంపై అన‌న్య పాండే స్పందించింది. వేల మంది ఆధార‌ప‌డి వున్న సినిమాల‌ని బాయ్ కాట్ చేయ‌డం స‌రికాద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ క‌ల‌గ‌జేసుకుని బాయ్ కాట్ చేస్తున్న వాళ్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య ఇవ్వాల్సిన ప‌ని లేద‌న్నాడు. అంతే కాకుండా బాయ కాట్ చేస్తే చేయ‌నివ్వండి.. వాళ్ల మాట ప‌ట్టించుకునేది ఎవ‌రు.. థియేట‌ర్ల‌కు వ‌చ్చే వాళ్లు వ‌స్తారు. లేదా ఓటీటీల్లో చూస్తారు.. అంతే కానీ బాయ్ కాట్ చేస్తే ఏమౌతుంది.. చేసుకోన‌వ్వండి.. అని విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌డం ఇప్ప‌డు ఫ్యాన్స్ లో టెన్ష‌న్ పుట్టిస్తోంది. చిన్న కార‌ణం దొరికితే చాలు నెట్టింట చెడుగుడు ఆడుకోవాల‌ని చేసే బ్యాచ్ కు విజ‌య్ అన్న మాట‌లు మ‌రింత బూస్ట్ ని అందించాయ‌ని టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.