Begin typing your search above and press return to search.

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టు బిగిస్తున్న ఉచ్చు

By:  Tupaki Desk   |   19 Sept 2021 10:00 AM IST
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టు బిగిస్తున్న ఉచ్చు
X
అశ్లీల వీడియోల కేసులో హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారం బాలీవుడ్ ను షేక్ చేసింది. అనేకమంది నటీనటులు, మోడల్స్ రాజ్ కుంద్రాతో తమకు ఎదురైన అనుభవాలను బహిరంగంగా చెబుతుండడంతో ఆయన చిక్కుల్లో పడ్డాడు. ఈ వ్యవహారంలో చాలా మంది పేర్లు బయటకు వస్తుండడంతో ఎప్పుడు ఎవరి మెడకు ఇది చుట్టుకుంటుందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను తమ కస్టడీలోకి తీసుకన్న విషయం తెలిసిందే.

తాజాగా శిల్పాశెట్టి ఈ కేసుకు సంబంధించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తాను కెరీర్ లో బిజీగా ఉన్న కారణంగా తన భర్త ఏం చేస్తున్నారు అనే విషయాలు తనకు తెలిసేవి కాదని’ పేర్కొన్నారు. ఆయన లావాదేవీలకు సంబంధించిన విషయాలు కూడా తనకు తెలియవు అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్టు అయ్యింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు మరిత సంచలనానికి దారితీశాయి. తమ యాప్ లో అశ్లీల చిత్రాల్లో నటించాలంటూ రాజ్ కుంద్రా అతడి క్రియేటివ్ డైరెక్టర్ తనను వేధించేవాళ్లు అంటూ ఆమె పేర్కొన్నారు.

ఇక భర్త వ్యాపారాలు, వ్యవహారాల గురించి శిల్పాశెట్టి తెలియదనడం ఎంతవరకూ నిజమో మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి అంటూ షెర్లిన్ చోప్రా తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది.

షెర్లిన్ చేసిన తాజా వ్యాఖ్యలతో రాజ్ కుంద్రా కేసు మరింత జఠిలం అవుతోంది. మరి ఈ కేసుపై ముంబై పోలీసులు రాజ్ కుంద్రాకు కఠిన శిక్ష విధించాలనే నిర్ణయం తీసుకుంటే రాజ్ కుంద్రా భవిష్యత్ మరింత అంధకారమవుతుంది.