Begin typing your search above and press return to search.

నాగ్ తో మరిచిపోలేని అనుభవం.. బాలీవుడ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   19 Dec 2020 10:15 AM IST
నాగ్ తో మరిచిపోలేని అనుభవం.. బాలీవుడ్ బ్యూటీ
X
కింగ్ నాగార్జునతో పనిచేసిన అనుభవం మరిచిపోలేనిదని అంటోంది హీరోయిన్ సయామి. ఆయనతో షూట్ తర్వాత నాగ్ ఫ్యాన్ గా మారిపోయానని చెప్పింది. ఈ అనుభవం ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పొకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ.

హీరో నాగార్జున రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత నెలలోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. 2021 ప్రారంభంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నాారు. ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ ‘రా’ ఏజెంట్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే.. ఈ సినిమాలో నాగ్ తో కలిసి పనిచేసిన తర్వాత.. ఆయన అభిమాని అయ్యానని సయామి తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. నాగ్‌తో కలిసి పనిచేసిన కాలాన్ని మరపురాని అనుభవంగా అభివర్ణించింది సయామీ. కాగా.. వైల్డ్ డాగ్‌లో తన పాత్ర కోసం సయామి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుందట. ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ కూడా చేసిందట ఈ బాలీవుడ్ బ్యూటీ. మరి, సినిమాలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. టాలీవుడ్ లో తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియాలంటే ‘వైల్డ్ డాగ్’ ను వాచ్ చేయాల్సిందే.