Begin typing your search above and press return to search.

కరణం మల్లేశ్వరి కోసం బాలీవుడ్‌ బ్యూటీ?

By:  Tupaki Desk   |   12 Jun 2020 6:15 AM GMT
కరణం మల్లేశ్వరి కోసం బాలీవుడ్‌ బ్యూటీ?
X
ఒలంపిక్‌ పతకం విజేత.. తెలుగు అథ్లెట్‌ అయిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ ను తెరకెక్కించబోతున్నట్లుగా ప్రముఖ రచయిత దర్శకుడు అయిన కోన వెంకట్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. మొదట ఈ బయోపిక్‌ కు నిత్యా మీనన్‌ ను అనుకున్నారు. కాని ఆమె కొన్ని కారణాల వల్ల సినిమాకు నో చెప్పింది. ఆ తర్వాత తాప్సి.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ల పేర్లు కూడా వినిపించాయి. కాని అవి పుకార్లే అంటూ తేలిపోయింది. తాజాగా మరో హీరోయిన్‌ పేరు ఈ బయోపిక్‌ కు వినిపిస్తుంది.

ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ లో తెరకెక్కించి పలు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే బాలీవుడ్‌ హీరోయిన్‌ అయితే అందరికి రీచ్‌ అవుతుందనే అభిప్రాయంతో మేకర్స్‌ ఉన్నారట. బాలీవుడ్‌ హీరోయిన్‌ భూమీ పడ్నాకర్‌ ను ఇటీవలే ఈ సినిమా మేకర్‌ సంప్రదించడం ఆమె దాదాపుగా ఓకే చెప్పడం జరిగి పోయిందట.

ఇప్పటికే సినిమాను అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌ హీరోయిన్‌ ను కూడా ప్రకటించి రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెళ్లబోతున్నారు. ఇదే ఏడాదిలో ఈ సినిమాను షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాదికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో కోన వెంకట్‌ ఉన్నాడట. ఈ సినిమాకు సంజన రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఈమద్య కాలంలో బయోపిక్‌ లకు మంచి స్పందన వస్తున్న కారణంగా కరణం మల్లేశ్వరి సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.