Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీ...!

By:  Tupaki Desk   |   12 May 2020 5:40 PM IST
టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీ...!
X
బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించిన హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. 'ఆషికీ 2' చిత్రంతో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్ శ్రద్ధగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. 'ఏక్ విలన్' 'ఏబీసీడీ' 'ఏబీసీడీ 2' 'స్ట్రీట్ డాన్సర్' 'భాగీ' 'భాగీ 3' 'స్త్రీ' 'చిచ్చోరే' సినిమాలతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అందంతో పాటు అభినయం కలబోసిన శ్రద్ధా కపూర్ అవార్డులతో పాటు సినీ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి సింగర్ గా.. యాక్టర్ గా.. డ్యాన్సర్ గా మల్టీ రోల్స్ ప్లే చేస్తూ అదరగొడుతోంది. ఇక యంగ్ రెబల్ స్టార్ నటించిన 'సాహో' సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

'సాహో' సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో కూడా బాగా ఫేమస్ అయింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా శ్రద్ధా కపూర్ మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. తన గ్లామర్‌ తో డ్యాన్సులతో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీకి సౌత్ లో మరో సినిమా చేసే ఛాన్స్ మాత్రం దొరకలేదు. దీనికి కారణం 'సాహో' సినిమా తెలుగులో అనుకున్న రేంజ్ లో విజయం సాధించకపోవడమే. కానీ ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం రెకార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టి.. ఆ ఏడాది రిలీజైన సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన చేరింది. కానీ ఏం లాభం. మన టాలీవుడ్ లో సెంటిమెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయం అందరికి తెలిసిందే. అందం అభినయం లాంటివి ఎన్ని ఉన్నా ఒక సినిమా పరాజయం పాలైతే వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఐరన్ లెగ్ ముద్ర వేసేస్తారు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ పరిస్థితి కూడా అలానే తయారైంది.

'సాహో' సినిమాకి ముందు ఈమె తో సినిమా తీయాలని ప్రయత్నించిన టాలీవుడ్ హీరో దర్శక నిర్మాతలు సైతం ఇప్పుడు శ్రద్ధా కపూర్ పై శ్రద్ధ పెట్టడం లేదు. కానీ శ్రద్ధా కపూర్ మాత్రం టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తోందట.. పెద్ద ఆఫర్స్ వస్తే తెలుగు సినిమాల్లో నటించాలని అనుకుంటుంటోందట. మంచి స్టోరీతో వస్తే నటించడానికి నేనెప్పుడే సిద్ధమే అని చెప్తోందట. ఇంతకముందు కూడా మళ్ళీ ప్రభాస్ తో నటించడానికి రెడీ అని శ్రద్ధా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ఈ అమ్మడి మీద టాలీవుడ్ మేకర్స్ శ్రద్ధ పెడితే తన బ్యూటీతో టాలెంట్ తో టాప్ హీరోయిన్ గా మారే లక్షణాలు శ్రద్ధా కపూర్ కి పుష్కలంగా ఉన్నాయి. మరి మన టాలీవుడ్ మేకర్స్ అదే విధంగా ఆలోచిస్తారేమో చూడాలి.