Begin typing your search above and press return to search.
దీపికనూ చుట్టేసిన కొవిడ్.. ఐసోలేషన్లో బాలీవుడ్ బ్యూటీ!
By: Tupaki Desk | 5 May 2021 2:20 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కొవిడ్ బారిన పడ్డారు. మంగళవారం ఆమెకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్దారించినట్టు సమాచారం. దీంతో.. డాక్టర్ల సలహాల మేరకు దీపిక హోం ఐసోలేషన్లో ఉన్నట్టు సమాచారం.
అయితే.. ఇప్పటికే ఆమె ఫ్యామిలీ మొత్తానికీ కొవిడ్ సోకిన విషయం తెలిసిందే. దీపిక తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొణె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
భార్య ఉజ్వలతోపాటు మరో కూతురు అనిషా కూడా కొవిడ్ బారిన పడ్డారు. వీరిద్దరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. ప్రకాష్ పదుకొణె కూడా హోం ఐసోలేషన్లోనే ఉన్నప్పటికీ.. జ్వరం తగ్గకపోవడంతో శనివారం ఆసుపత్రిలో చేరినట్టు బ్యాడ్మింటన్ అకాడమీ తెలిపింది. అయితే.. ప్రకాష్ ఆరోగ్యం బాగుందని, మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
దీపికా సినిమాల గురించి చూస్తే.. ప్రస్తుతం తన సొంత బ్యానర్లో హాలీవుడ్ మూవీ 'ది ఇంటర్న్' సినిమా హిందీలో రీమేక్ చేస్తోందీ బ్యూటీ. ఈ సినిమాలో దీపికాతోపాటు రిషికపూర్ నటించాల్సి ఉంది. కానీ.. ఆయన చనిపోవడంతో ఆ పాత్రను అమితాబ్ పోషించినున్నారు.