Begin typing your search above and press return to search.

బాల‌య్య స‌ర‌స‌న `డ‌బుల్ ఎక్స్ ఎల్` బ్యూటీ

By:  Tupaki Desk   |   30 July 2022 2:30 AM GMT
బాల‌య్య స‌ర‌స‌న `డ‌బుల్ ఎక్స్ ఎల్` బ్యూటీ
X
న‌ట‌సింహ బాల‌కృష్ణ సినిమాలో హీరోయిన్ పాత్ర ప్రాధాన్య‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌య్య రోల్ తో పాటు హీరోయిన్ పాత్ర కూడా సినిమాలో ఆద్యంతం  ప‌రుగులు పెట్టాల్సిందే. బాల‌య్య‌తో సినిమాలు చేయాల‌నుకున్న ద‌ర్శ‌కులు హీరోయిన్ కి ఆ స్థాయి ప్రాధాన్య‌త త‌ప్ప‌నిస‌రి. ఆయ‌న ద‌గ్గ‌ర హీరో రోల్ తో మెప్పించి సినిమా చేసేద్దామంటే? అంత వీజీ కాదు.

సినిమాకి సంబంధించి ప్ర‌తీ విష‌యాన్ని అడిగి తెలుసుకుంటారు. త‌న‌తో పాటు మిగ‌తా పాత్ర‌ల ఫ‌రిది ఎంతంత మాత్రం అన్న‌ది తెలుసుకుని  బాల‌య్య ప‌రిప‌సూర్ణ అవ‌గాహ‌న‌తో బ‌రిలోకి దిగుతుంటారు. ఇటీవ‌లే `అఖండ`తో మ‌రో  బ్లాక్ బ‌స్ట‌ర్  ఖాతాలో వేసుకుని సింగం మాంచి స్పీడ్ మీదుంది. ప్ర‌స్తుతం బాల‌య్య #107 గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కి చేరుకుంది. దీంతో యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడితో 108వ చిత్రాన్నిసెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. ఇది బాల‌య్య మార్క్  హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. ఇందులో బాల‌య్య ఐదు పదుల వ‌య‌సున్న తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ఇప్ప‌టికే బాల‌య్య‌ కుమార్తె పాత్ర‌కి యంగ్ హీరోయిన్  శ్రీలీల లాక్ అయింది.  మ‌రి ఇందులో బాల‌య్య‌కి జోడీ ఎవ‌రంటే? ఇప్ప‌టికే ప్రియ‌మ‌ణిని  తీసుకోవాల‌నుకున్నట్లు ప్రచారం సాగింది. కానీ ప్రియ‌మ‌ణి ఔడెటెడ్ కావ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నట్లు స‌మాచారం. ఇప్పుడా స్థానం కోసం ఏకంగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ సోనాక్షి సిన్హానే బ‌రిలోకి దించే ప్లాన్ లో ఉన్న‌ట్లు తెలిసింది.

త్వ‌ర‌లోనే సోనాక్షిని క‌లిసి ద‌ర్శ‌కుడు క‌థ  వినిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. బాల‌య్య‌కి జంట‌గా సోనాక్షి ప‌ర్పెక్ట్ గా సూట‌వుతుంద‌ని టీమ్ న‌మ్మ‌కంగా క‌నిపిస్తోంది. గ‌తంలో సూప‌ర్  స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న `లింగ‌`లో సోనాక్షి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో 60 ఏళ్ల హీరో స‌ర‌స‌న సోనాక్షి ఎలా సెట్ అవుతంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి.

కానీ సోనాక్షి మాత్ర‌మే ఆ పాత్ర‌కి న్యాయం చేస్తుంద‌ని రిలీజ్ త‌ర్వాత అర్ధ‌మైంది. ఇప్పుడు బాల‌య్య పాత్ర ప‌రంగా చూస్తే సోనాక్షి ప‌ర్పెక్ట్ ఆప్ష‌న్ గా చెప్పొచ్చు. బాల‌య్య వ‌య‌సుని సోనాక్షి మ్యాచ్ చేయ‌గ‌ల‌దు. ఆయ‌న వేగాన్ని అందుకోగ‌ల‌దు. మ‌రి సోనాక్షి ఏమంటుందో చూడాలి. ప్ర‌స్తుతం  ఆమె న‌టించిన  `డుబుల్ ఎక్స్ ఎల్` విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.