Begin typing your search above and press return to search.

ఇస్కూల్ పిల్ల‌లా ఆ డ్రెస్సెంటి అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   30 July 2022 1:30 PM GMT
ఇస్కూల్ పిల్ల‌లా ఆ డ్రెస్సెంటి అమ్మ‌డు?
X
వేసవి సెల‌వులు ముగియ‌డం..స్కూళ్లు తెర‌వ‌డంతో! మ‌ళ్లీ పిల్ల‌లంతా స్కూ ల్ కి...కాలేజేల‌కు వెళ్ల‌డం మొద‌లుపెట్టారు. అన్ని స్కూల్స్ లో కొత్త అడ్మిష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. పిల్ల‌కాయ‌లంతా కొత్త యూనిఫారాలు వేసుకుని బ‌డికెళ్లిపోతున్నారు. మ‌రి 'లైగ‌ర్' బ్యూటీ అన‌న్య పాండే కూడా కొత్త‌గా ఏదైనా స్కూల్ లో జాయిన్ అయ్యిందంటారా? అంటే సందేహం రాక‌మాన‌దు.

అన‌న్య కూడా అలాంటి స్కూల్ యూనిఫాం లాంటి మోడ‌ల్ దుస్తుల్లోనే క‌నిపిస్తుంది. ఇదిగో ఇక్క‌డిలా ఎరుపు-తెలుపు గ‌ళ్ల నిక్క‌రు...దానికి మ్యాచింగ్ గా అదే రంగు డిజైన‌ర్ చొక్కా ధ‌రించింది. చొక్కా మ‌ధ్య లో నుంచి క్లీవేజ్ అందాలు హైలైట్ అవుతున్నాయి. ఆగ్యాప్ గ‌నుక లేక‌పోతే? ఇస్కూల్ కి పోయే పాపాయి అంటే అంతా నమ్మేస్తారు.

ఏడెనిమిది త‌ర‌గ‌తులు చ‌దివే హైస్కూల్ అమ్మాయిలానే క‌నిపిస్తుంది. మ‌రి అనన్య ఇలా ఎందుకు ముస్తాబు అయిందంటే? 'లైగ‌ర్' సినిమా ప్ర‌మోష‌న్ కోస‌మ‌ని తెలుస్తోంది. ఈ బ్యూటీ 'లైగ‌ర్' తో టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. డెబ్యూ మూవీ కావ‌డంతో సినిమా ప్రచారంలో పూరి టీమ్ తో మ‌మేక‌మైపోయింది.

పూరి ఎక్క‌డుంటే? అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణ ఉంటుంది. అందుకే 'లైగ‌ర్' ప్ర‌మోష‌న్ కూడా అన‌న్య‌కి ఓ పిక్ నిక్ లా ఉంద‌ని అంటోంది. సినిమా ప్ర‌మోష‌న్ లా లేదు...చిన్న వ‌యసులో పిల్ల‌లంతా క‌లిసి పిక్ నిక్ వెళ్తున్న‌ట్లు అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చింది.

అదంతా పూరి క‌ల్పించిన ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ని వాతావ‌ర‌ణం. అది పూరి కాంపౌండ్ లో మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. పూరితో సినిమాకు ప‌నిచేయ‌డం కూడా అలాగే ఉంటుంది.

ఎంతో జోవియ‌ల్ ప‌ర్స‌న్. కోప‌మెరుగ‌ని మ‌నిషి. ప‌ని మాత్ర‌మే బాగా తెలిసి గొప్ప మ‌నిషి. ఇక 'లైగ‌ర్' సినిమా ఆగ‌స్టు 25న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించాడు. ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధ‌ర్మ ప్రొడక్ష‌న్స్ భాగ‌మైంది.