Begin typing your search above and press return to search.

అంబానీల ఇళ్ల సరసన నిలిచే బాద్షా 'మన్నత్‌' విశేషాలు

By:  Tupaki Desk   |   22 Oct 2021 10:03 AM IST
అంబానీల ఇళ్ల సరసన నిలిచే బాద్షా మన్నత్‌ విశేషాలు
X
బాలీవుడ్‌ బాద్ షా ఇళ్లు మన్నత్ మరో సారి వార్తల్లో నిలిచింది. ఇండియాలోనే టాప్ రేటెడ్‌ ఇళ్లలో మన్నత్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. అంబానీల ఇళ్ల సరసన నిలిచేంతటి గొప్ప ఘనత దక్కించుకున్న మన్నత్‌ లో ఎన్ సీ బీ అధికారులు రైడ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. షారుఖ్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. ఆ కేసుల్లో ఆర్యన్ దాదాపుగా నెల రోజులుగా జైల్లోనే మగ్గుతున్నాడు. ఇటీవల షారుఖ్‌ వెళ్లి తన కొడుకును జైల్లోనే కలిసి వచ్చాడు. బెయిల్‌ కోసం పదే పదే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ సమయంలో మన్నత్ లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో ఎన్‌ సీ బీ అధికారులు సోదాలు నిర్వహించడం షారుఖ్‌ కు మరింతగా ఆవేదన కలిగించే విషయం. ఈ సమయంలో మన్నత్‌ గురించి మరోసారి వార్తలు జోరుగా వస్తున్నాయి.

షారుఖ్‌ రాజ సౌదం మన్నత్ గురించి మీడియాలో గొప్పగా కథనాలు వస్తున్నాయి. 20 ఏళ్ల క్రితం మన్నత్‌ ను కేవలం రూ.13.32 కోట్లకు కొనుగోలు చేసిన షారుఖ్‌ ఖాన్‌ ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయించాడు. ఇప్పుడు మన్నత్‌ ఖరీదు మార్కెట్‌ విలువ ప్రకారం ఏకంగా 350 నుండి 360 కోట్లు ఉంటుందని అంటున్నారు. మన్నత్‌ మొత్తం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. షారుఖ్‌ ఫ్యామిలీ వినియోగించుకునేది మాత్రం కేవలం రెండు అంతస్తులే. అందులో ప్రైవేట్‌ థియేటర్‌.. ఆఫీస్‌.. స్విమ్మింగ్‌ పూల్‌.. గెస్ట్‌ హౌస్‌.. ప్లే ఏరియా.. గెస్ట్ హౌస్‌ ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. మన్నత్‌ అంటే ముంబయిలోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ప్రతి రోజు కనీసం వెయ్యి మంది షారుఖ్‌ అభిమానులు ఇతర సినిమా వర్గాలకు చెందిన వారు మన్నత్‌ వద్దకు వస్తారు. అక్కడ షారుఖ్‌ దర్శనం కోసం పడిగాపులు కాస్తారు.

మన్నత్‌ ను మొదట గుజరాతీ పార్సీ అప్పట్లో విల్లా వియన్నా అనే పేరుతో నిర్మించుకున్నాడు. అతడి నుండి షారుఖ్‌ ఖాన్‌ 2001 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది. ఆ సమయంలో 13 కోట్లు పెట్టి షారుఖ్‌ ఇల్లు కొనుగోలు చేయడం అందరికి షాకింగ్ గా అనిపించింది. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్‌ అవ్వడంతో కోట్లు ఖర్చు పెట్టి దేశ విదేశాల నుండి అద్బుతమైన మెటీరియల్‌ ను తెప్పించి మన్నత్‌ ను అద్బుతంగా మలిచారు. మన్నత్‌ ఇంటీరియర్ కు అత్యధికంగా ఖర్చు చేయడంతో పాటు విదేశీ టెక్నాలజీని వినియోగించారు. ఈ ఇంటి యొక్క ముఖ్య ప్రాముఖ్యత అన్ని ప్లోర్‌ ల్లో కూడా బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలో నిల్చుంటే అద్బుతమైన సముద్రపు అందాలు కనిపిస్తూ ఉంటాయి. సముద్రం ఫేసింగ్ తో అద్బుత నిర్మాణ చాతుర్యంతో ఉండే మన్నత్‌ షారుఖ్‌ ఖాన్‌ కు ఆయన సినిమాల మాదిరిగానే గౌరవంను తీసుకు వచ్చింది అనడంలో సందేహం లేదు.

ఆ ఇంట్లో అడుగు పెట్టడంతోనే ఒక అద్బుత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఫీల్‌ కలుగుతుందని అందులో కి వెళ్లి వచ్చిన వారు అంటూ ఉంటారు. అంతటి అద్బుతమైన ఇంట్లోకి ఎన్‌ సీ బీ అధికారులు వెళ్లి డ్రగ్స్ కోసం వెదకడం విచారకరం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌ అయినప్పటి నుండి మన్నత్‌ లో వేడుకలు లేవు.. పండుగలు లేవు.. చాలా స్తబ్దుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన దుఃఖ సాగరంలో మునిగి పోయారు. మన్నత్ లో ఎప్పుడు పండుగ వాతావరణం ఉంటుంది. కాని ఆర్యన్‌ జైలుకు వెళ్లడంతో ఇంట్లో స్వీట్లు పూర్తిగా మానేశారు. భోజనం కూడా సాదా సీదాగా ఉంటున్నట్లుగా సమాచారం అందుతోంది.