Begin typing your search above and press return to search.

ఏప్రల్‌ను విపరీతంగా వేడిక్కిచ్చారంతే...

By:  Tupaki Desk   |   13 April 2015 11:00 PM IST
ఏప్రల్‌ను విపరీతంగా వేడిక్కిచ్చారంతే...
X
ఏదైనా మ్యాగజైన్‌ కవర్‌పేజీపై కథానాయిక ఛాయాచిత్రాన్ని ముద్రించడం అంటే అది ఆషామాషీ కాదు. అత్యంత ప్రతిష్ఠాత్మకం. ప్రపంచం కళ్లన్నీ కవర్‌పేజీపైనే వాలుతాయి. ముఖ్యంగా వోగ్‌, జీక్యూ, హార్పస్‌ బజార్‌, జూస్‌ వంటి మ్యాగజైన్ల కవర్‌పేజీల్ని అలంకరించే అదృష్టం వరించింది అంటే ఆ స్టార్‌ రేంజు కూడా సరితూగాలి. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో రెయిజింగ్‌ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న సోనమ్‌, నర్గీస్‌, నిమ్రత, జాక్విలిన్‌ ప్రఖ్యాత మ్యాగజైన్ల కవర్‌పేజీల్ని అలంకరించి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు.

క్యూట్‌ సోనమ్‌ .. ప్రఖ్యాత ఓగ్‌ కవర్‌పేజీపై దర్శనమిచ్చింది. ఇటీవలే అనూహ్యంగా స్వయిన్‌ ఫ్లూ బారిన పడిన ఈ అమ్మడు కోలుకున్నాక ఈ కవర్‌పేజీతో ఓగ్‌ మార్కెట్లోకి వచ్చింది. అలాగే మరో హాట్‌ గాళ్‌ నర్గీస్‌ ఫక్రీ.. ది జూస్‌ మ్యగజైన్‌ కవర్‌ పేజీపై దర్శనమిచ్చింది. నిమ్రత్‌ కౌర్‌.. ది లంచ్‌ బాక్స్‌ చిత్రంతో ఫేమస్‌ అయ్యింది. ఈ భామ జిక్యూ కవర్‌పేజీపై అదిరిపోయే ఫోజులిచ్చింది. శ్రీలంకన్‌ బ్యూటీ జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌ హార్పస్‌ బజార్‌ కవర్‌పేజీపై దర్శనం ఇచ్చింది. కుర్రతార ఆలియాభట్‌ గ్రజియా అనే ప్రఖ్యాత మ్యాగజైన్‌ కవర్‌పేజీపై దర్శనమిచ్చింది. ఇవన్నీ ప్రత్యేకంగా బాలీవుడ్‌ టీవీ చానెళ్ల వంటకాల్లోకి వచ్చేశాయి.