Begin typing your search above and press return to search.

బాలీవుడ్ భామ‌ల పెళ్లిళ్లు అన్నీ రాజీ బేర‌మేనా?

By:  Tupaki Desk   |   12 Sep 2021 4:56 AM GMT
బాలీవుడ్ భామ‌ల పెళ్లిళ్లు అన్నీ రాజీ బేర‌మేనా?
X
భార‌తీయ సంస్కృతి సంప్ర‌దాయాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అందులోనూ పెళ్లిళ్ల విష‌యంలో ఇండియ‌న్ క‌ల్చ‌ర్ లో ఎన్నో ప‌ద్ధ‌తులు..సంప్ర‌దాయ‌లు ఉన్నాయి. రాష్ట్రాల‌ను బ్ట‌టి... కులాల్ని బ‌ట్టి.. మ‌తాల్ని బ‌ట్టి అవి మారుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో పెళ్లి వేడుక‌కు ఒక్కొక్క ప్ర‌త్యేక‌త ఉంటుంది. తాజాగా కొంద‌రు బాలీవుడ్ హీరోయిన్ల పెళ్లిల‌ను ఓసారి ప‌రిశీలిస్తే ఆ విష‌యం మ‌రింత క్లారిటీగా అర్థ‌మ‌వుతుంది.

ముఖ్యంగా వ‌ధువు వేష‌ధార‌ణ మేక‌ప్ విధానంలోనూ వేరియేష‌న్ ని గ‌మ‌నించాలి. పెళ్లి కోసం వ‌ధువును త‌మ ప‌ద్ద‌తుల్లో ఎంత అందంగా త‌యారు చేసారంటే? త‌మ పురాత‌న ఆచారాల్ని సైతం అనుస‌రిస్తారంటే ఆస‌క్తిక‌రం. అయితే పెళ్లి సాంప్ర‌దాయాల వ‌ల్ల‌ కొంత మంది హీరోయిన్లు త‌మ వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను కోల్పోవాల్సి వ‌చ్చింద‌ట‌. నిత్యం త‌మ‌తో పాటు ఉండే ప్రోఫెష‌న‌ల్ డిజైన‌ర్ల‌ను సైతం ప‌క్క‌న బెట్టి పెద్ద‌వాళ్ల మాట‌ల ప్ర‌కారం న‌డుచుకున్నారు.

ష‌ర్మిలా ఠాగూర్ తొమ్మిద‌వ న‌వాబు అయిన భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌న్సూర్ అలీఖాన్ ప‌టౌడీని 1968 లో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్ద‌రిది ప్రేమ వివాహం.. వివాహానికి ముందే ష‌ర్మిల ఇస్లాం మతంలోకి మారారు. ఇక పెళ్లి స‌మ‌యంలో ష‌ర్మిలాను అత్త‌గారు ఎంతో ప్ర‌త్యేకంగా అలంక‌రించారు. పటౌడీ పెళ్లికూతురు సంప్ర‌దాయంలో ముస్తాబు చేసి వ‌రుడి ప‌క్క‌న కూర్చోబెట్టారు. ఒళ్లంతా బంగారం అలంక‌రించి..పెళ్లి వ‌స్త్రాన్ని ప్ర‌త్యేకంగా బంగారంతో డిజైన్ చేసారు. ప‌టౌడీల్లోనే ఈ పెళ్లి అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఇదే సంప్ర‌దాయంలో క‌రీనా క‌పూర్ కూడా సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకుంది. క‌రీనా అత్త‌గారు ష‌ర్మిలా ఠాగూర్ ధ‌రించిన అదే షారా అనే వ‌స్త్రాల‌ను క‌రీనా కూడా పెళ్లి స‌మ‌యంలో ధ‌రించింది. కుర్తా-దుప‌ట్టా నారింజ రంగులో ఉండ‌గా..ష‌రారా పుదీనా ఆకుప‌చ్చ రంగును క‌ల్గి ఉంది.

అలాగే మ‌రో బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్ వివాహం పంజాబీ సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో జ‌రిగింది. పైలెట్ రిషీ అత్తార్ ని ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిలో గుల్ ప‌నాగ్ త‌ల్లి కుమార్తెను ఎంతో అందంగా డిజైన్ చేసారు. గులాబీ రంగు ఎంబ్రాయిడ‌రీ డ్రెస్ ధ‌రించిం ది. అయితే సంగీత్ కార్య‌క్ర‌మానికి మాత్రం గుల్ అత్త‌గారి వ‌స్త్రాల‌నే సంప్ర‌దాయం ప్ర‌కారం ధ‌రించింది. పింక్ స్క‌ర్ట్..దుప‌ట్టాతో పాటు ఆకుప‌చ్చ కుర్తాలో క‌నిపించింది.

అలాగే మ‌రో బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్ ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకుంది. పెళ్లి కి సోన‌మ్ టెక్స్ టైల్స్ పున‌ర్జీవ‌క‌ర్త‌గా భావించే ఆనురాద్ వాకిల్ డిజైన్ చేసిన వ‌స్ర్తాన్నే ధ‌రించింది. సోన‌మ్ ధ‌రించిన న‌గ‌ల‌న్ని పురాతన కాలానికి చెందిన‌వే. ఇవ‌న్నీ సోన‌మ్ త‌ల్లి కి చెందిన పురాత‌న‌ న‌గ‌లు.

ఇక యామీ గౌత‌మ్ `ఊరి` ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్ద‌రి వివాహం కొండ‌లోయ్య‌ల్లో ప‌హాడీ ఆచారాల‌ ప్ర‌కారం జ‌రిగింది. ఈ పెళ్లి కోసం యామీ గౌత‌మ్ ఎరుపురంగు చీర‌ను ధ‌రించింది. మ్యాచింగ్ బ్లౌజు ద‌రించింది. త‌ల‌పై ధ‌రించిన దుప‌ట్టా యామీ అమ్మ‌మ్మ‌ది. మ‌న‌వారాలికి అమ్మ‌మ్మ దుప‌ట్టా బ‌హుమ‌తిగా ఇచ్చిందిట‌. అలాగే గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ వివాహం క్రిష్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. ఇందులో పీసీ క‌స్ట‌మ్ వైట్ గౌను ద‌రించింది. ఈ గౌను పోడ‌వు 75 అడుగులు. ఈ గౌనుని పీసీ అత్త‌గారు డెనిస్ మిల్ల‌ర్ జోనాస్ పీసీకి అందించారు.

టాలీవుడ్ సెల‌బ్రిటీల వివాహాల్లోనూ ఇలాంటి రాజీ వ్యవ‌హారాలున్నాయి. వ‌ధువు అలంక‌ర‌ణ‌ల‌కు వ‌రుడి త‌ర‌పు సంప్ర‌దాయ విధానాలు అమ‌లైన సంద‌ర్భాలున్నాయి. నాగ‌చైత‌న్య‌- స‌మంత .. రానా- మిహీక‌.. నితిన్-షాలిని .. నిఖిల్ -ప‌ల్ల‌వి వివాహాల్లోనూ సాంప్రదాయబ‌ద్ధ‌మైన క‌ట్టు బొట్టు క‌నిపించింది.