Begin typing your search above and press return to search.

చరణ్​ తో మళ్లీ జోడికట్టనున్న బాలీవుడ్ చిన్నది..!

By:  Tupaki Desk   |   23 May 2021 7:34 AM GMT
చరణ్​ తో మళ్లీ జోడికట్టనున్న బాలీవుడ్ చిన్నది..!
X
ఆర్​ఆర్​ఆర్​ (’రణం రౌద్రం రుధిరం’ ) కోసం మెగాఫ్యాన్స్​, ఇటు జూనియర్​ ఎన్టీఆర్​ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్​ఆర్​ఆర్​ లో చరణ్​ అల్లూరిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్​ కు జోడీగా బాలీవుడ్​ నటి అలియా భట్​ నటిస్తోంది. అయితే ఆర్​ఆర్​ఆర్​ తర్వాత చరణ్​ ప్రముఖ దర్శకుడు శంకర్​ తో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​ చేయబోతున్నాడు. ఈ చిత్రం పాన్​ఇండియా లెవెల్​ లో భారీగా తెరకెక్కబోతున్నది. శంకర్​ ఇండియన్​ -2 తర్వాత ఈ సినిమా ప్రారంభిస్తాడని టాక్​.

అయితే ప్రస్తుతం ఇండియన్​- 2 పలు వివాదాల్లో చిక్కుకున్నది. నిర్మాణ సంస్థకు దర్శకుడు శంకర్​ కు మధ్య వివాదం నెలకొన్నది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఆ లోపు శంకర్​.. చరణ్​ తో సినిమా తీస్తాడని సమాచారం.

ఇండియన్​ -2 నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్​ ప్రస్తుతం కోర్టుకు వెళ్లింది. ముందుగా తమ సినిమా తెరకెక్కించాలని సదరు సంస్థ కోరుతున్నది. అయితే శంకర్​ మాత్రం చరణ్​తో సినిమా చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఈ సినిమా పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. దీంతో హీరోయిన్​ కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్​ హీరోయిన్స్​ ను సంప్రదించారు.

అయితే చివరకు అలియానే హీరోయిన్ గా కన్​ఫార్మ్​ చేసినట్టు సమాచారం. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరవైపు శంకర్​ తో మెగా పవర్​స్టార్​ చరణ్​ సినిమా అనగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇటు తెలుగు అటు తమిళంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.