Begin typing your search above and press return to search.

కరోనా బారిన పడిన ఎన్టీఆర్ హీరోయిన్.. తన ఇద్దరు పిల్లలకు కూడా..!

By:  Tupaki Desk   |   19 April 2021 6:01 PM IST
కరోనా బారిన పడిన ఎన్టీఆర్ హీరోయిన్.. తన ఇద్దరు పిల్లలకు కూడా..!
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగడంతో పాటుగా మరణాలు సంభవిస్తుబడటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక సినీ ప్రముఖులంతా వరుసపెట్టి కరోనా గుప్పిట్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది సెలబ్రెటీలు కోవిడ్ బారిన పడగా.. తాజాగా తెలుగమ్మాయి, బాలీవుడ్ నటి సమీరా రెడ్డికి మహమ్మారి సోకినట్లు వెల్లడించారు. తనతో పాటు తన పిల్లలకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుపుతూ.. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

తనకు నాలుగు రోజుల క్రితం కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలిందని.. ఇప్పుడు తన ఇద్దరు పిల్లలకు కూడా కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని సమీరారెడ్డి తెలిపింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో క్షేమంగా ఉన్నామని.. ఇటువంటి సమయంలోనే మంచి ఆలోచనలు, భవిష్యత్ పై ఆశలతో ఆశాభావ దృక్పథంతో ఉండాలని పేర్కొంది. కరోనాను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమీరా రెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. దీంతో అభిమానులు ఆమెతో పాటు.. ఆమె ఇద్దరు పిల్లలు కూడా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

కాగా, రాజమండ్రి ప్రాంతానికి చెందిన సమీరారెడ్డి.. హిందీ తెలుగు తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. చిరంజీవితో 'జై చిరంజీవ'.. సూర్యతో కలిసి 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'.. ఎన్టీఆర్ సరసన 'అశోక్' సినిమాల్లో నటించింది సమీరా. తెలుగులో చివరిగా 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో ప్రత్యేక గీతంలో మెరిసింది. సమీరా రెడ్డి 2014 లో వ్యాపారవేత్త అక్షయ్ వార్దే వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన సమీరా.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ ని ఎంజాయ్‌ చేస్తోంది.