Begin typing your search above and press return to search.
సెట్లో నుదురు పగిలి రక్తశిక్తం.. అయినా భయపడని నటి!
By: Tupaki Desk | 28 Aug 2021 4:32 PM ISTఆన్ లొకేషన్ ప్రమాదాల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఇవి రెగ్యులర్ గా జరిగేవే. రిస్కీ స్టంట్స్ చేసేప్పుడు చిన్నదో పెద్దదో ప్రమాదం జరగడం చూస్తున్నదే. 2019లో అయితే దాదాపు డజను మంది టాలీవుడ్ స్టార్లు వరుస పెట్టి యాక్సిడెంట్లకు గురయ్యారు. ఆన్ లొకేషన్ యాక్సిడెంట్లు కొన్ని ప్రయాణాల్లో కొన్ని బెంబేలెత్తించాయి. ఆ ఏడాది కొన్ని వరుస మరణాలు.. యాక్సిడెంట్లతో ఏదో పెనుగండం పొంచి ఉందని టాలీవుడ్ పెద్దలు దైవపూజలు చేశారు.
గోపిచంద్- వరుణ్ తేజ్- సందీప్ కిషన్ సహా పలువురు గాయాల పాలవ్వడం ఇంతకుముందు కలవరపాటుకు గురి చేసింది. ఇప్పుడు ఓ హాలీవుడ్ సిరీస్ కోసం సాహసాలు చేస్తున్న ప్రియాంక చోప్రాకు ప్రమాదం ఎదురైంది. ప్రియాంక తన ముఖంపై రక్తపు మరకలతో ఒక స్నాప్ ను సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. నుదురుపై చీలింది.. అలాగే బుగ్గపై గాటు పడింది. ఏ గాయం నిజమో..? ఏది కాదో గుర్తించమని ఆమె తన అనుచరులను పీసీ అడిగింది.
పీసీ చెంపపై గాయం నిజమని ఆమె నుదుటిపై ఉన్నది గాయం కాదని అనుచరుడు చెప్పినప్పుడు ప్రియాంక వేగంగా సమాధానం ఇచ్చింది. అతను తప్పు చెప్పాడు అంటూ తన ముఖం క్లోజ్ అప్ ఫోటోను పంచుకుంది. ఫోటోలో ప్రియాంక కనుబొమ్మపై లోతుగా కోసినట్టు గాయం కనిపిస్తోంది. కానీ గాయంతో బాధపడకుండా ప్రియాంక సిరీస్ కోసం షూటింగ్ కొనసాగించింది. ప్రియాంక తన తొలి వెబ్ సిరీస్ సిటాడెల్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదంలో గాయపడింది. ఇక నుదురు చీలిపోయి రక్తశిక్తమై కనిపిస్తున్న తీరు చూస్తుంటే గాయం మరీ చిన్నదేమీ కాదని అర్థమవుతోంది. ప్రమాదాల్లో ఏమైనా జరగొచ్చు.
ఈ యాక్షన్ సిరీస్ కి గతంలో `ఎవెంజర్స్ ఎండ్ గేమ్`కు దర్శకవిభాగంలో సాయపడిన రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో కొద్ది భాగం భారతదేశంలో కూడా చిత్రీకరించనున్నారు. ప్రియాంక చోప్రా తదుపరి మ్యాట్రిక్స్ 4లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.