Begin typing your search above and press return to search.

వీధి వీధినా కండోమ్ లు అమ్ముతున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   6 May 2022 2:30 AM GMT
వీధి వీధినా కండోమ్ లు అమ్ముతున్న బ్యూటీ
X
కండోమ్ ప్ర‌చారం అంటే ఒక‌ప్పుడు మెయిన్ స్ట్రీమ్ నాయిక‌ల ప‌ని కాదు. ఐట‌మ్ భామ‌లు.. శృంగార నాయిక‌లు.. లేదా డీగ్రేడ్ న‌టీమణుల‌తో ఆ ప‌ని కానిచ్చేసేవారు. కానీ ఇటీవ‌లి కాలంలో కండోమ్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించేందుకు ప్ర‌ముఖ క‌థానాయిక‌లు క్యూ క‌డుతుంటే ఆశ్చ‌ర్యపోతున్నారు ప్ర‌జ‌లు. డిజిట‌ల్ మాధ్య‌మాల్లో ఆదాయ ఆర్జ‌న కోసం ఇంత‌కు తెగిస్తున్నారు.

బాలీవుడ్ నటి నుష్రత్ భారుచా ఇప్పుడు వీధి వీధినా తిరిగి కండోమ్ లు అమ్ముతోంది. కండోమ్ సేల్ కోసం ఈ అందాల భామ ట్రిక్కు చూస్తుంటే ఔరౌరా! అనేస్తారు. నిజానికి ఇది రియ‌ల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో చూపిస్తున్న వింత‌. నుష్రత్ త‌దుప‌రి చిత్రం `జన్ హిత్ మే జారీ` లో సీన్ అది. కూటి కోసం కోటి విద్యలు. ఇది కండోమ్ లు అమ్మే అమ్మాయి కథ. జై బసంతు సింగ్ దర్శకత్వం వహించారు. మధ్యప్రదేశ్ లోని ఒక అమ్మాయి తన పట్టణంలో కండోమ్ లు అమ్ముతూ జీవ‌నం సాగిస్తుంది. సామాజిక నిషేధం కారణంగా ఈ భామ‌ ఎదుర్కొనే అనేక సవాళ్ల చుట్టూ క‌థ తిరుగుతుంది. అయితే ఆమె తన కుటుంబం స‌హా సమాజంపై పోరాడుతుంది. జన్హిత్ మే జారీ కోసం నుష్రత్ మరోసారి డ్రీమ్ గర్ల్ రచయిత రాజ్ శాండిల్యతో కలిసి పనిచేశారు.

`జన్హిత్ మే జారీ క్యాప్షన్‌`లు ఆకర్షణీయంగా ఉన్నాయి. `శరం తో బద్దమీజీ సే ఆనీ చాహియే,... సురక్షా రఖ్నే మే నహీ .. యే సుచ్నా హై #జన్ హిత్ మీ జార్...డ్రగ్స్ ఖరీద్ నే సే షరం కరో కండోమ్ ఖరీద్ నే సేతాల్ ఖరీద్నే.. వంటి క్యాప్షన్ లతో సినిమా పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కరో కండోమ్ ఇస్తెమాల్ కర్నే సే నహిన్..!! అంటూ నుస్ర‌త్ హంగామాను తెర‌పై చూపిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 10న విడుదలవుతోంది. ప్ర‌స్తుతం వేడెక్కించే పోస్టర్లు సందడి చేస్తున్నాయి. మే 6న ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. కండోమ్ సేల్ పేరుతో ఈ మూవీ టికెట్ సేల్ అదిరేట్టు క‌నిపిస్తోంది. ఆ మేర‌కు సినీపండితుల విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.