Begin typing your search above and press return to search.

మ‌లైకా ఇలా గుండెల్ని మెలిపెట్ట‌కు

By:  Tupaki Desk   |   19 Sep 2021 3:30 AM GMT
మ‌లైకా ఇలా గుండెల్ని మెలిపెట్ట‌కు
X
బాలీవుడ్ హాట్ గాళ్ .. లేటు వ‌య‌సు ఘాటు సుంద‌రి మ‌లైకా హాట్ అందాల‌తో గుండెల్ని పిండేస్తోంది. ఏజ్ లెస్ బ్యూటీ మ‌లైకా అరోరా అందం రోజు రోజుకీ రెట్టింప‌వుతోంది. వయస్సు పెరుగుతున్నా కోట్లాది మందికి కంటికి కునుకు లేకుండా చేస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ న‌టించిన `దిల్ సే` చిత్రంలో `ఛ‌ల్ ఛ‌య్య ఛ‌య్య ఛ‌య్యా ఛ‌య్యా.``. అంటూ ఐట‌మ్ బాంబులా పేలింది. త‌న‌వైన‌ ఒంపు సొంపుల‌తో మ‌త్తెక్కించిన ఈ బ్యూటీ ప‌వ‌న్ గ‌బ్బ‌ర్ సింగ్ లో కెవ్వు కేక అంటూ అల‌రించింది. వ‌య‌సు పెరుగుతున్నా ఇప్ప‌టికీ వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో హీటెక్కిస్తోంది.

అర్భాజ్‌ఖాన్ నుంచి విడిపోయిన మ‌లైకా అరోరా ఆ త‌రువాత యంగ్ హీరో,,, బోనీ క‌పూర్ త‌న‌యుడు అర్జున్ క‌పూర్ తో గ‌త కొంత కాలంగా చెట్ట‌ప‌ట్టాలేసుకుని షికార్లు చేస్తోంది. ముంబై వీధుల్లో ఈ జంట‌దే హ‌వా. ఐటామ్ సాంగ్ ల‌కు.. డ్యాన్స్ రియాలిటీ షోల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన మలైకా ఫ్యాషన్ సెన్స్ గురించి ప్ర‌త్యేకంగా పరిచయం చేయ‌న‌వ‌సరం లేదు. ఎందుకంటే ఆమె తన మోడ్ర‌న్ స్టైల్ కాస్ట్యూమ్స్ తో ఎక్కడికి వెళ్లినా అందరినీ ఆశ్చర్యపరుస్తూ వుంటుంది. ఫ్యాష‌న్ ప్ర‌పంచ‌పు మ‌హారాణిలా ఏల్తోంది.

ఆమె ఫ్యాషన్ ప్ర‌పంచంలోనూ త‌న స‌త్తాని చాటుకుంటూ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మలైకా తాజా ఫోటోషూట్ తో ఇంటర్నెట్ ని మ‌రోసారి త‌న‌దైన హాట్ నెస్ తో హీటెక్కించేసింది. మెటాలిక్ ఫుషియా ఆఫ్-షోల్డర్ టాప్,.. ప్యాంటులో ఫొటోల‌కు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట త‌న అభ‌మానుల కోసం షేర్ చేసింది. త‌న‌దైన ఫ్యాషన్ తో ఇప్ప‌టికే అగ్రస్థానంలో నిలిచిన మలైకా అరోరా తాజా డ్రెస్ లో త‌న అందాల‌తో చంపేస్తోంది.

మెడకు నెక్ టైట్ గోల్డ్ నెక్లెస్,.. రైట్ హ్యాండ్ లో బ్లాక్ క‌ల‌ర్‌ బ్యాగ్ ప‌ట్టుకుని ఉంగరాల జుట్టు.. స్మోకీ ఐ మేకప్ తో కిల్లింగ్‌ లుక్ తో చంపేస్తోంది. విభిన్న‌మైన భంగిమ‌ల్లో మ‌లైకా ఫొటోల‌కి పోజులిచ్చిన స్టిల్స్ చూసిన అమె అభిమానులు నెటిజ‌న్స్ మ‌లైకా ఇలా గుండెల్ని మెలిమెట్ట‌కా..అంటూ కాముంట్లు చేస్తున్నారు.