Begin typing your search above and press return to search.

కింగ్ నాగ్ సినిమాలో బాలీవుడ్ యాక్ట్రెస్..!

By:  Tupaki Desk   |   11 May 2021 10:30 AM GMT
కింగ్ నాగ్ సినిమాలో బాలీవుడ్ యాక్ట్రెస్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకునే హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ హీరోలలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరో నాగ్ అనే చెప్పాలి. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. ఇప్పుడు భారీ యాక్షన్ సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. పిఎస్‌వి గరుడవేగ మూవీతో స్టైలిష్‌ మేకర్ అనిపించుకున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఆ సినిమాతో తనలోని మరో యాంగిల్ బయటికి తీసాడు సక్సెస్ అందుకున్నాడు. ఎన్నడూ లేనివిధంగా ఆ సినిమాలో హీరో రాజశేఖర్ ను కొత్తగా చూపించాడు.

ప్రస్తుతం ప్రవీణ్ సినిమాలో పరిగెత్తడానికి కింగ్ నాగ్ వంతు రానే వచ్చింది. ఇప్పటికే నాగార్జునను ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపెందుకు క్యారెక్టర్ డిజైన్ చేసాడట. ఇప్పటికైతే వీరిద్దరి కాంబినేషన్ మూవీ పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదివరకే షూట్ ప్రారంభించి నాగ్ - ప్రవీణ్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈసారి నాగ్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో నాగ్ ఎక్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.

ప్రస్తుతం ఆ పాత్రకోసం నాగ్ చాలా మేకోవర్ అయ్యాడట. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో నాగ్ చెల్లి క్యారెక్టర్ లో బాలీవుడ్ యాక్ట్రెస్ గుల్ పనాగ్ నటించనున్నట్లు సమాచారం. ఇటీవలే ఆమెతో మేకర్స్ చర్చలు జరుపగా ఆమె నుండి రెస్పాన్స్ సానుకూలంగా వచ్చిందని.. ఆమె కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నందుకు హ్యాపీగా ఉందంటూ కథనాలు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. అనిఖా సురేంద్రన్ కీలకపాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈ హై వోల్టెజ్ యాక్షన్ సినిమాను నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.