Begin typing your search above and press return to search.
రెండో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. త్వరలో తెలుగు ఎంట్రీ!
By: Tupaki Desk | 13 Feb 2021 2:30 PM ISTబాలీవుడ్ నటి దియా మీర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ ముప్పై తొమ్మిదేళ్ల వయ్యారి హైదరాబాద్ లో పుట్టిపెరిగింది. కానీ ముంబైలో సెటిల్ అయింది. ఇక్కడే పుట్టి పెరిగినా కూడా దియా తెలుగు సినిమాలలో మాత్రం చేయలేదు. 2001లో 'రెహానా హై తేరే దిల్ మే' అనే బాలీవుడ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన దియా.. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అంటే 2021లో వైల్డ్ డాగ్ అనే సినిమాతో తెలుగులో అడుగుపెడుతోంది. అయితే తాజాగా దియా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 15న ముంబైలో వైభవ్ రేఖి అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది. దియా పెళ్లి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం బంధుమిత్రుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే దియాకు ఇది రెండో పెళ్లి. ఇదివరకు 2014లో సాహిల్ సంఘ అనే వ్యాపారవేత్తను పెళ్ళాడింది దియా. కానీ ఐదేళ్ళ కాపురం తర్వాత 2019లో ఇద్దరూ విడిపోయారు.
తన మాజీ భర్తతో విడిపోయిన విషయం కూడా సోషల్ మీడియాలో ప్రకటించింది అమ్మడు. “5 సంవత్సరాలు మా జీవితాలను పంచుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నాము. కానీ ఎప్పటికి మేం స్నేహితులుగా ఉంటాము. మేం వేరైనా మా బంధానికి మాత్రం ఎల్లప్పుడూ కృతజ్ఞులమే" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దియాకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నేటిజన్లు. దియాకు కాబోయే భర్త వైభవ్ రేఖితో కలిసి బాంద్రలోని పాలిహిల్ ప్రాంతంలో నివసించునుందట. నాలుగు పదుల వయసు దగ్గర పడిన దియా మీర్జా.. హైదరాబాద్ నాజర్ పాఠశాలలో స్కూలింగ్, స్టాన్లీ కాలేజీలో విద్యను పూర్తి చేసిందట. ఇక దియా 2000లో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ సినిమాలలో రాణించింది. చూడాలి మరి ఇన్నేళ్లకు తెలుగులో అడుగు పెడుతోంది.. సక్సెస్ అందుకుంటుందేమో!