Begin typing your search above and press return to search.
అందాల ఐశ్వర్య ని అభిమానులు కొత్తగా చూడనున్నారా?
By: Tupaki Desk | 28 Aug 2022 8:20 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కి దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కాస్త తగ్గినా పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి అంటూ అందమైన అమ్మాయి అంటే ఐశ్వర్య రాయ్ పేరు చెప్పేవారు. అలాంటి అందమైన ఐశ్వర్య రాయ్.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఐశ్వర్య రాయ్ త్వరలో పొన్నియన్ సెల్వన్ 1 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ సినిమా లో ఐశ్వర్య రాయ్ ఒక మహారాణి పాత్ర గా సమాచారం అందుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సమయం లోనే ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరింత ఆసక్తికర విషయం ఏంటి అంటే రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ తో కనిపించబోతుందట. ఇప్పటి వరకు అందాల ఐశ్వర్య రాయ్ ని హీరోయిన్ గా మాత్రమే ప్రేక్షకులు చూశారు. మొదటి సారి విలన్ గా ఆమెను చూడబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. ఎన్నో సినిమాల్లో అందమైన హీరోయిన్ పాత్రలో కనిపించిన ఐశ్వర్య రాయ్ ని ఒక్కసారిగా విలన్ పాత్రలో చూడండి అంటే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చెప్పలేం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఐశ్వర్య కనుక విలన్ గా కనిపిస్తే అది సినిమాకు చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు.
ఆ పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారు అనే విషయం పక్కన పెడితే తప్పకుండా అందాల ఐశ్వర్య పొన్నియన్ సెల్వం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ ఈ సినిమాలో నటించడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ను తమిళ బాహుబలి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.