Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై బాలీవుడ్ విలనిజం

By:  Tupaki Desk   |   1 July 2017 8:48 AM GMT
టాలీవుడ్ పై బాలీవుడ్ విలనిజం
X
సినిమా తెరపై గ్లామర్ ఒలకబోసేందుకు సంశయిస్తారనే కారణంతో.. తెలుగు అమ్మాయిలను కాకుండా పరాయి భాషల నుంచి హీరోయిన్లను తెచ్చుకోవడం టాలీవుడ్ కి అలవాటే. ఎక్కువగా బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ను దింపేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విలన్స్ విషయంలో కూడా మనోళ్లు బాలీవుడ్ పైనే ఎక్కువగా ఆధారపడిపోతున్నారు.

రోనిత్ రాయ్.. నీల్ నితిన్ ముకేష్.. అర్బాజ్ ఖాన్.. తరుణ్ అరోర్.. ఆశుతోష్ రానా.. సుశాంత్ సింగ్.. ఇలా వరుసగా టాలీవుడ్ లోకి దిగిపోతున్నారు.. క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తున్నారు. తెలుగులో చాలామంది హీరో పాత్రలే కావాలంటారు తప్ప.. విలన్ గా నటించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీలో అర్బాజ్ ఖాన్ విలనిజం చూపించిన నిర్మాత అనిల్ సుంకర అంటున్నారు. క్రేజ్ కోసమో.. మరే కారణాలతోనో ఇలా పరాయి భాషల నుంచి విలన్స్ ను తీసుకొచ్చాక.. దర్శకులకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఎన్టీఆర్ జై లవ కుశలో విలన్ గా నటించిన రోనిత్ రాయ్ తో తొలి రోజులు తెగ ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.

చాలా సమయాల్లో వీళ్లు డైలాగ్స్ చెప్పకుండా.. కేవలం నెంబర్స్ చెబుతూ మేనేజ్ చేస్తుంటారట. దీంతో.. లీడ్ కేరక్టర్స్ కు డైలాగ్స్ చెప్పడం ఎమోషన్స్ పండించడం కష్టమయిపోతోందని అంటున్నారు మేకర్స్. అయితే.. హిందీ విలన్స్ తో తెలుగు ఆర్టిస్టులకు వచ్చిన నష్టం ఏమీ ఉండదని.. ఎక్స్ ప్రెషన్స్.. డైలాగ్స్.. వీటన్నిటినీ కోరుకునే మేకర్స్ తెలుగు విలన్స్ కే మొగ్గుతారని అంటున్నాడు రావు రమేష్. తెలుగు నటులు విలన్స్ గా సీన్స్ పండించినపుడు.. వినిపించే చప్పట్లు ఈలలు.. ఎంతటి పెద్ద హిందీ విలన్ ను పట్టుకొచ్చినా ఉండవన్నాడాయన.

తెలుగులో విలన్స్ గా నటించేందుకు ఎక్కువ మంది నటులు లేరంటున్న బోయపాటి.. యాక్షన్స్ సీన్స్.. ఎమోషన్స్ పండిస్తూ.. డైలాగ్స్ చెప్పగలిగే తెలుగు యాక్టర్స్ ఉన్నపుడు వాళ్లకే ప్రిఫర్ చేస్తామని అన్నాడు. అందుకే తాను జగపతిబాబును విలన్ గా పరిచయం చేసిన సంగతి గుర్తు చేశాడు బోయపాటి శ్రీను

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/