Begin typing your search above and press return to search.
వెంకీ 'సైంధవ్' లో బాలీవుడ్ విలక్షణ నటుడు
By: Tupaki Desk | 26 Jan 2023 10:35 AMవెంకటేష్ 75వ సినిమా గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న సైంధవ్ సినిమా చిత్రీకరణ నేడు లాంచనంగా ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే టైటిల్ పోస్టర్ ను విడుదల చేయడంతో పాటు ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ ను విడుదల చేయడం జరిగింది.
సైంధవ్ లో వెంకటేష్ యొక్క లుక్ కు అభిమానులు ఫుల్ గా ఫిదా అవుతున్నారు. ఇదో మంచి రివేంజ్ థ్రిల్లర్ డ్రామా అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. వెంకటేష్ ఇటీవల సినిమాల విషయంలో కాస్త స్లో అయ్యాడు. సక్సెస్ ల విషయంలో కూడా ఫ్యాన్స్ ను నిరాశ పర్చుతున్నాడు. అలాంటి వెంకీ ఈ సినిమాతో సక్సెస్ ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయిన నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర కచ్చితంగా సైంధవ్ కి అదనపు ఆకర్షణ అవ్వబోతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.
ఈ సినిమాను తెలుగు తో పాటు హిందీ ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల చేయబోతున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమాలో ఉండటం వల్ల ఖచ్చితంగా అక్కడ మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు షూటింగ్ ప్రారంభం సందర్భంగా సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.