Begin typing your search above and press return to search.

చీరకట్టుతో చిచ్చు రేపుతున్న బోల్డ్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   19 May 2021 8:00 AM IST
చీరకట్టుతో చిచ్చు రేపుతున్న బోల్డ్ బ్యూటీ..!
X
పాపులర్ బాలీవుడ్ గ్లామర్ డాల్ షామా సికందర్.. గురించి గ్లామర్ ప్రియులకు పరిచయం అక్కర్లేదు. ఇదివరకే పలు బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన ఈ సికందర్ భామ.. కెమెరా ముందు అందాలను ఆరబోయడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఈ అమ్మడు "యే మేరీ లైఫ్ హై" అనే టీవీ సిరీస్ తో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అనంతరం 'సెక్సహాలిక్' అనే బోల్డ్ షార్ట్ ఫిల్మ్ తో పాటు 'మాయ' అనే రొమాంటిక్ వెబ్ సిరీస్ లలో నటించి అభిమానులకు డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఇప్పటివరకు షామా చాలా సినిమాలో మెరిసింది. 1999లో అమిర్ ఖాన్ హీరోగా నటించిన 'మన్' మూవీతో కెరీర్ ప్రారంభించింది.

కానీ అంతకుముందే 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసిన షామా.. టీవీ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మాయ వెబ్ సిరీస్, బైపాస్ రోడ్ అనే బోల్డ్ సినిమాలతో ప్రేక్షకులలో సెగలు రేపింది. అయితే నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న రాజస్థానీ బ్యూటీ.. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా మెరిసింది. షామాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది.

తాజాగా ఈ వయ్యారి సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు సారీ కట్టుకొని సోఫాలో బోల్డ్ లుక్కిచ్చింది. చీరకట్టులో షామా అందాలన్నీ బయట పెట్టేసింది. అందమైన మేనిఛాయతో.. రొమాంటిక్ మూడ్ ఉట్టిపడేలా పోజిచ్చింది. అంతే సారీలో షామా హాట్ ఫిగర్ చూసి నెటిజన్లు లైక్స్ కొట్టకుండా ఉండట్లేరు. నిజానికి స్కిన్ షో చేయడంలో షామా దిట్ట. అందుకే ఆమెను ఆరాధించే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం వయ్యారి పిక్ వైరల్ అవుతోంది.