Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న బోల్డ్ బ్యూటీ న్యూ పిక్!

By:  Tupaki Desk   |   25 March 2021 3:30 PM GMT
వైరల్ అవుతున్న బోల్డ్ బ్యూటీ న్యూ పిక్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో 'ఆర్ఎక్స్100' మూవీతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకుంది ఢిల్లీబ్యూటీ పాయల్ రాజపుత్. మొదటి సినిమాతోనే నెగటివ్ యాంగిల్ లో మంచి గుర్తింపు దక్కించుకకుంది పాయల్. ఎంట్రీతోనే ఫస్ట్ హిట్ కొట్టింది కానీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కాలేకపోయింది. అవకాశాలు కూడా పెద్దగా రాలేదట. బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చేసరికి అన్ని బోల్డ్ సినిమా కథలే వచ్చాయట. కానీ అవన్నీ కాదని 'ఆర్డిఎక్స్ లవ్' అనే బోల్డ్ సినిమా చేసింది. ఆ సినిమాలో ఎన్నడూ చూడని పాయల్ అందాల ఆరబోత మాములుగా లేదు. అందం దెబ్బతో కుర్రకారుకి మతిపోయింది కానీ సినిమా ప్లాప్ అయింది. ఆ సినిమా ప్లాప్ ప్రభావం పాయల్ పై బాగా చూపింది. ఇన్నేళ్ళైనా ఇంకా ఆర్ఎక్స్100 హీరోయిన్ గానే చలామణి అవుతోంది పాయల్.

ఆ మధ్యలో అవకాశాలు లేక సీత సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. అనంతరం నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ 'వెంకిమామ'లో మెరిసింది. ఆ సినిమా మోస్తరు హిట్ అయినా పాయల్ కు లాభం లేదు. అయితే ఈమధ్య హీరోయిన్స్ వెబ్ సిరీస్, వెబ్ ఫిలిమ్స్ అంటూ ఓటిటి వైపు మళ్లుతున్నారు. అదేవిధంగా పాయల్ కూడా ఓటిటి వైపు అడుగులేసే ఆలోచనలో ఉంది. అయితే ఇటీవలే పాయల్ ఓటిటికోసం అవినాష్ కోకాటి వెబ్ ఫిల్మ్ కు ఓకే చెప్పిందట. అంటే ఈ లెక్కన పాయల్ కూడా ఓటిటిలో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో పాయల్ అందాలకు ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే అమ్మడు అప్పుడప్పుడు వేడెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పాయల్ మార్నింగ్ పిక్స్ షేర్ చేసింది. బెడ్ పై లాంగ్ షర్ట్ తో నిద్రలేచి 'ఆసమ్ టుడే' అంటూ కాప్షన్ జోడించింది. గ్లామర్ షో అయితే లేదుగాని పిక్స్ మాత్రం తెగవైరల్ అవుతున్నాయి.