Begin typing your search above and press return to search.

బిగ్గినీ షూట్ తో మెంట‌లెక్కించిన బోల్డ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   12 Jan 2021 6:00 PM IST
బిగ్గినీ షూట్ తో మెంట‌లెక్కించిన బోల్డ్ బ్యూటీ
X
నేను ఒక సాగ‌ర క‌న్యను‌.. నాకు లోతు అంటే భయం లేదు.. లోతు లేని చోట‌ లివింగ్ అన్నా గొప్ప భయం .... !! అంటూ అదిరిపోయే కొటేష‌న్ ఇచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ. హృద‌యం ఈమోజీల్ని షేర్ చేసింది. బీచ్ లైఫ్ అన్నా వాట‌ర్ బేబిగా మారిపోవ‌డం అన్నా ఈ హాటీకి చాలా చాలా ఇష్టం అంట‌. పైగా లోతుగా ఉండే బీచ్ ల‌కే వెళ‌తాన‌ని చెప్పింది.

అంతేకాదు.. ఇది బికినీ కాదు బిగ్గినీ అంటూ బోలెడంత సంబ‌రంగా చెప్పుకొచ్చింది. ఇంత‌కీ ఈవిడెవ‌రు అంటే పేరు నేహా మాలిక్. మోడ‌ల్ కం న‌టి.. ల‌గ్జ‌రీ లివింగ్ స్టైల్.. ల‌గ్జ‌రీగా ప్ర‌యాణాలు చేయ‌డం అన్నా చాలా చాలా ఇష్టం ఈవిడ‌కు.

ఇక బులుగు జిలుగు స‌ముద్రంలో బీచ్ ఇసుక‌ల్లో నేహా చేసిన సంద‌డి మామూలుగా లేదు. ఆ గ‌మ్మ‌త్త‌యిన మ‌త్త‌యిన ప‌చ్చ‌ బిగ్గినీ అదిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో దుమారం రేపుతున్నాయి. దీనికి హాటెస్ట్ బిగ్గినీ అంటూ కామెంట్లు చేస్తూ కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి నేహా మాలిక్ బికినీ అందాలకు సౌత్ డైరెక్ట‌ర్లు ప‌డిపోయి అవ‌కాశాలిస్తారా? అన్న‌దే ఇప్ప‌టికి స‌స్పెన్స్. బ‌న్వారీ కా జాల్ అనే హిందీ (2018) చిత్రంలో న‌టించిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత పెద్ద రేంజు కెరీర్ ని ఆశిస్తోంది. అయితే పోటీ రంగంలో ఆశించిన‌ది ద‌క్కాలంటే ఇదిగో ఇలా బిగ్గినీ ట్రీట్ ని రెగ్యుల‌ర్ గా ఇవ్వాల్సి ఉంటుంది.