Begin typing your search above and press return to search.

బోల్డ్ బ్యూటీ స‌మాజంపై మ‌ళ్లీ ఏసేసిందిగా..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:37 AM GMT
బోల్డ్ బ్యూటీ స‌మాజంపై మ‌ళ్లీ ఏసేసిందిగా..!
X
సోష‌ల్ మీడియా ఫ్యాష‌నిస్టా నిఖితా శ‌ర్మ బోల్డ్ అవ‌తార్ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ ఇన్ స్టా క‌థ‌నాలు ప‌రిశీలిస్తే ఏ ఇత‌ర స్లిమ్ బ్యూటీకి త‌గ్గ‌ని బోల్డ్ ఫోటోషూట్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. కాస్త బొద్దుగా ఉంటేనేం.. బొద్దే ముద్దు అంటూ బోలెడంత ప్ర‌మోష‌న్ కూడా చేసుకుంటుంది. నిఖిత‌ ఫేమ‌స్ మోటివేష‌న్ స్పీక‌ర్ .. వ్య‌క్తిత్వ వికాస నిపుణురాలు .. టీవీ న‌టి గాను రాణిస్తోంది.

నిఖిత తాజా ఇన్ స్టా ప్రొఫైల్ ఫోటో నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ గా మారింది. మ‌రోసారి మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ త‌న‌దైన శైలిలో స‌మాజంపై విరుచుకుప‌డింది. "సంవత్సరాలుగా నా "శరీర రకం" (బొద్దుత‌నం) ఏం ధరించవచ్చు .. ఏం ధరించకూడదు? అనేది సమాజం నాకు చెబుతోంది. మన జీవితాల‌ను మన చేతుల్లోకి తీసుకునే సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ప్రపంచం మాట్లాడనివ్వండి.. వారి అభిప్రాయాలు చెవిటిత‌నంతో విని లైట్ తీస్కోండి!" అని సెల‌విచ్చింది.

మీ జీవితం మీ ఇష్టం. మీకు వీలైనంత శక్తివంతంగా.. అద్భుతంగా మరియు మరపురానిదిగా మ‌లుచుకోండి! అని నికితా శర్మ నేటిత‌రానికి సూచించింది. #బాడీపాజిటివిటీ అంటూ త‌న‌దైన శైలిలో స‌రికొత్త ప్ర‌చారం చేసింది ఈ బ్యూటీ. ప‌నిలో ప‌నిగా డిజైన‌ర్ దుస్తుల‌కు ప్ర‌మోష‌న్ చేసింది.

నిఖిత టీవీ న‌టిగా బోల్డ్ పెర్ఫామ‌ర్ గాను రాణిస్తోంది. ఈ భామ‌ నిరంత‌రం త‌న కుటుంబ స‌భ్యుల‌తో లైఫ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వ‌రుస ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తుంది. ఇక ఈ బ్యూటీ పూల్ సైడ్ అన్ లిమిటెడ్ ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. టీవీ న‌టి నికితాశ‌ర్మ బికినీ ఫోటోలు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తూనే ఉన్నాయి. ఈ భామ‌ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ నిఖితా టూపీస్ మత్తు గురించి నిరంత‌రం చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిక‌రం. త‌న ఫోటోషూట్ల‌పై హాటెస్ట్ కామెంట్ల‌తో విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తుంటారు. కాక‌లు పుట్టించే అందాల సోయ‌గం.. అంటూ కామెంట్లు చాలా రొటీన్ గా క‌నిపిస్తుంటాయి.

ఇంత‌కీ ఎవ‌రీ నిఖితా శ‌ర్మ అంటే? నిఖితా నేటివ్ ప్లేస్ ఢిల్లీ. అక్క‌డే పుట్టి పెరిగింది. మోటివేష‌న్ స్పీక‌ర్ గా ఇంత‌కుముందు ఫేమ‌స్ అయ్యింది. ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అవార్డులు రివార్డులు ద‌క్కించుకుంది. అటుపై హీరోయిన్ గా ఎద‌గాల‌ని ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి ప్ర‌వేశించింది. కానీ సినిమా అవ‌కాశాలు రాలేదు. చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది గానీ..బాలీవుడ్ లో ఏ ద‌ర్శ‌క నిర్మాత ఎంక‌రేజ్ చేయ‌లేదు. దీంతో బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ మాత్రం బాగానే స‌క్సెస్ అయింది. చాలా సీరియ‌ళ్లు..షోల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం బుల్లి తెర‌పై యాక్టివ్ గానే ఉంది.

సినిమాల్లో అవ‌కాశాలు కోసం ఇంకా ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. ఇక ఇన్ స్టాలో నిఖితా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. టెప్టింగ్ కామెంట్ల‌తో కాక‌లు రేప‌డం త‌న‌కు కొత్తేమీ కాదు. నిఖిత ఇన్ స్టాలో ఎంతో జోవియ‌ల్ గా ఉండే ఫోటోగ్రాఫ్స్ వీడియోల‌కు కొద‌వేమీ లేదు. అందుకే నిఖితా పాలోవ‌ర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. నిఖితా శ‌ర్మ రెగ్యుల‌ర్ అప్ డేట్స్ తో ఫాలోవ‌ర్స్ అటెన్ష‌న్ ని డ్రా చేస్తోంది. స‌మాజంపై ప్ర‌తిసారీ ఏదో ఒక సెటైర్ వేస్తూ నిఖిత త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.