Begin typing your search above and press return to search.
పాల బుగ్గల హన్సికతో హీరోగారి బ్యూటిఫుల్ రొమాన్స్
By: Tupaki Desk | 16 Oct 2020 2:20 PM ISTజయం రవి- అరవింద్ స్వామి కాంబినేషన్ అనగానే తని ఒరువన్ గుర్తుకు వస్తుంది. మెడికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ సంచలనం సృష్టించగా తెలుగులో రామ్ చరణ్ ఆ చిత్రాన్ని ధృవ పేరుతో రీమేక్ చేశారు. జయం రవి - మోహన్ రాజా బృందం తని ఒరువన్ సీక్వెల్ ని రూపొందించే పనిలో పడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు జయంరవి -అరవింద స్వామి కాంబో మూవీ భోగన్ తెలుగులో రిలీజవుతోంది. ఈ మూవీ ఇప్పటికే తమిళంలో విడుదలై మెప్పు పొందింది. సేమ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన బోగన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి సింధూర అనే పాటను విడుదల చేశారు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ ట్యూన్ చేసిన ఈ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. భువనచంద్ర ఈ పాటకు లిరిక్స్ అందించారు.
సింధూర సాంగ్ ఆద్యంతం విజువల్స్ రంగుల మయం అనే చెప్పాలి. ఒక చక్కని రొమాంటిక్ సాంగ్ ని మెలోడియస్ గా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా పాల బుగ్గల హన్సికతో జయం రవి రొమాన్స్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇక ఈ పాటలో హన్సిక అందచందాలు కుర్రకారును కవ్వించడం ఖాయం.
ట్రైలర్ అందరికీ నచ్చింది. ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామనే నమ్మకం మరింతగా పెరిగిందని నిర్మాత రామ్ తాళ్లూరి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నాజర్- పొన్ వణ్ణన్- నరేన్- అక్షర గౌడ ఇతర పాత్రధారులు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా,... సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. త్వరలోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.