Begin typing your search above and press return to search.

చెంప చెల్లుమ‌నేలా హాటీ స‌మాధానం

By:  Tupaki Desk   |   2 Sep 2019 2:39 PM GMT
చెంప చెల్లుమ‌నేలా హాటీ స‌మాధానం
X
బొద్దుగా ఉన్నా ముద్దొచ్చే అందం జ‌రైన్ ఖాన్. దాదాపు 50 కేజీల బ‌రువు త‌గ్గి క‌థానాయిక అయ్యింది. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ వీర్ అనే చిత్రం ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌యం చేశారు. క‌త్రిన‌కు సిస్ట‌ర్ లా క‌నిపించే ఈ అమ్మ‌డిని స్టార్ ని చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు భాయ్. ఆ క్ర‌మంలోనే రెడీ చిత్రంలోనూ అవ‌కాశం ఇచ్చాడు. కానీ దుర‌దృష్టం కొద్దీ ఈ భామ‌కు స‌రైన అవ‌కాశాలు ల‌భించ‌లేదు. ప్ర‌స్తుతం భారీ మ‌ల్టీస్టార‌ర్ హౌస్ ఫుల్ 4 లో న‌టిస్తోంది. అలాగే ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ తాజా చిత్రం చాణక్య‌లోనూ న‌టిస్తూ టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతోంది. కోలీవుడ్ లోనూ ఈ అమ్మ‌డు ఎంట్రీ ఇస్తోంది.

జ‌రైన్ తాజాగా `సిటీ ఆఫ్ లేక్స్` అనే క్యాప్ష‌న్ తో రాజ‌స్థాన్ లో దిగిన ఫోటోల్ని ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో జ‌రైన్ ఎంతో నేచుర‌ల్ గా క‌నిపిస్తోంది. జీన్స్ - వైట్ ష‌ర్ట్ వేసుకుంది. అయితే ఈ ఫోటోల్లో ఒక‌చోట‌ పొట్ట భాగం బ‌య‌ట‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనిపై నెటిజ‌నులు తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో కామెంట్లు చేశారు. లావు త‌గ్గేందుకు స‌ర్జ‌రీ చేయించుకున్నావా? ఆ పొట్ట‌పై కుట్లు ఏమిటి? అస‌లు అంత‌గా లావెక్కాలా? అంటూ ఇష్టానుసారం కామెంట్లు చేశారు.

అయితే ఈ కామెంట్ల‌పై జ‌రైన ఎంతో హుందాగా స్పందించింది. నా పొట్ట గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆస‌క్తి చూపిస్తున్నారు. అయినా నేను 50 కేజీల బ‌రువు త‌గ్గాను.. అందుకే పొట్ట అలా ఉంటుంది. అలా ఉంది క‌దా అని నేనేమీ ఫోటోషాప్ చేయించ‌లేదు. నా స‌హ‌జ‌మైన రూపం ఇది. దేనికీ శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకోలేదు. నేను ఎంత స‌హజంగా ఉంటానో దానినే ఒరిజిన‌ల్ గా చూపిస్తాను. అస‌హ‌జ‌త్వాన్ని ఇష్ట‌ప‌డ‌ను అని తెలిపింది. ఇలా ఉండ‌టాన్ని గ‌ర్వంగా ఫీల‌వుతాను అని చెంప చెల్లుమ‌నే స‌మాధానం ఇచ్చింది.