Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు కాబట్టే తీశాడట!

By:  Tupaki Desk   |   21 Sept 2017 1:48 PM IST
ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు కాబట్టే  తీశాడట!
X
ఓ సినిమా రిలీజ్ సమయంలో ఆ మూవీ హీరోను దర్శక నిర్మాతలు తెగ పొగిడేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే.. ఇవి ఒకోసారి శృతి మించుతుంటాయ్ కానీ.. ఒకోసారి మాత్రం వాస్తవమే అనిపించకమానదు. ఇవాళ జై లవ కుశ రిలీజ్ సందర్భంగా.. ఎన్టీఆర్ నటనా సామర్ధ్యంపై దర్శకుడు బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఈ మూవీ యంగ్ టైగర్ తో తీయడంతోనే ఇంత త్వరగా పూర్తయిందని.. ఎన్టీఆర్ కాకపోతే అసలీ కథను తెరకెక్కించేవాడినే కాదన్నది బాబీ వాదన. 'ఒకే సినిమాలో ఎక్కువ వేరియేషన్స్ చూపిస్తూ నటించడాన్ని అందరు యాక్టర్లు చేయలేరు. మేం ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేశాం. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఇలా తెరకెక్కించగలగడానికి కారణం.. కేవలం ఎన్టీఆర్. వేరే హీరో అయితే.. ఈ మూవీ పూర్తయేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. అసలు వేరే హీరోతో అయితే నేను ఈ సినిమా తీసే ధైర్యం చేసేవాడిని కూడా కాదు' అన్నాడు బాబీ.

ఈ కథ విన్నపుడే స్టోరీని ఎన్టీఆర్ ఎంతో నిమగ్నమైపోయాడని.. ఓ వారం పాటు జై పాత్ర కోసం హోం వర్క్ చేశాడని.. అందుకే ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయడం తనకు సాధ్యమైందని చెప్పాడు దర్శకుడు బాబీ. ఎన్టీఆర్ లాంటి కమిట్మెంట్ ఉన్న యాక్టర్ తో.. దర్శకుల పని చాలా సులభం అయిపోతుందని చెప్పడం విశేషం.