Begin typing your search above and press return to search.

బ్యాగ్రౌండ్ ఉన్నా.. ‘తెర’‌మ‌రుగ‌య్యాడు.. ఆ హీరో సినిమా కష్టాలు!

By:  Tupaki Desk   |   28 Jan 2021 6:00 PM IST
బ్యాగ్రౌండ్ ఉన్నా.. ‘తెర’‌మ‌రుగ‌య్యాడు.. ఆ హీరో సినిమా కష్టాలు!
X
బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో పాతుకుపోయిన బంధు ప్రీతి వల్ల.. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టిన‌వారు ఎద‌గ‌లేక‌పోతున్నార‌ని, వారు కెరీర్ తోపాటు జీవితాలు కూడా న‌ష్ట‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు కొంత‌కాలంగా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ విమ‌ర్శ‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి.

అయితే.. కావాల్సినంత‌ బ్యాగ్రౌండ్ ఉన్నా.. తెర‌మ‌రుగైన న‌టీన‌టులు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఉన్నారు. తెలుగులో కూడా ప‌లువురు ఉన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ మేక‌ర్స్ చుట్టూ తిరిగి.. ఏ ఛాన్స్ లేకుండా ఉండిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ ఉన్నారు. జనవరి 27న ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. ఆయ‌న కెరీర్ ను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. ప‌లు విష‌యాలు క‌నిపిస్తాయి.

దాదాపు.. ఐదేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయకుండా తాగుడుకు అలవాటు పడిపోగా.. భార్య అతణ్ణి ఇంటినుంచి కూడా బయటకు పంపేసింద‌ట‌. ఈ విష‌యం ఇవాళే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ధర్మేంద్ర రెండో కొడుకు బాబీ డియోల్‌. పెద్ద కొడుకు సన్ని డియోల్‌ను గ్రాండ్ గా లాంచ్‌ చేసిన ధర్మేంద్ర.. బాబీ డియోల్‌ను కూడా ‘బర్సాత్‌’ సినిమాతో ఇంట్రడ్యూస్‌ చేశాడు. కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత ‘గుప్త్‌’ సినిమాతో హిట్‌ కొట్టాడు బాబీ డియోల్‌. ఈ సినిమా త‌ర్వాత కొన్నాళ్లు అత‌ని కెరీర్‌ బాగానే సాగింది. 2012 త‌ర్వాత అతడికి ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు. ఫ్లాపుల హీరోగా పేరు పడిపోయి ఇంట్లోనే ఉండిపోయాడు. ‘ఎందరిని అడిగినా ఒక్కరు కూడా ఛాన్స్‌ ఇవ్వలేదు’ అని బాబీ డియోల్ ఆవేద‌న వ్య‌క్తంచేశాడు.

ఈ ప‌రిస్థితుల్లో డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాడు. తాగుడుకు బానిసై పోయాడు. దీంతో.. అత‌ని భార్య తాన్యా ఒక దశలో విసిగిపోయి ఇంటినుంచి వెళ్లగొట్టేంత పని చేసిందట. ఆ త‌ర్వాత‌.. ఆమె సపోర్ట్‌తోనే మెల్లగా అతను డిప్రెషన్‌ నుంచి బయటపడ్డాడు.

ఈ క్ర‌మంలో సల్మాన్‌ఖాన్‌ అతనికి ‘రేస్‌ 3’లో అవకాశం ఇచ్చాడు. అది ఆడకపోయినా.. బాబీకి పేరు వచ్చింది. ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన ‘ఆశ్రమ్‌’లో బాబీ డియోల్‌ విశేషమైన ప్రతిభ క‌న‌బ‌రిచి అందరినీ ఆకట్టుకున్నాడు. మ‌రి, ఇక‌మీద‌నైనా అత‌డి కెరీర్ స‌జావుగా సాగుతందా? లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.