Begin typing your search above and press return to search.
మాస్ రాజాతో బోయపాటి మరో సినిమా..!
By: Tupaki Desk | 30 March 2021 9:00 PM ISTటాలీవుడ్ మాస్ రాజా రవితేజ.. ప్రస్తుతం ఖిలాడి సినిమా చిత్రికరణతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది క్రాక్ సినిమాతో మాస్సివ్ హిట్ అందుకున్న రవితేజ వరుసగా సినిమాలను చేస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా క్రాక్ నిలిచింది. అయితే రవితేజతో వీర తర్వాత రమేష్ వర్మ రెండోసారి ఖిలాడి సినిమా రూపొందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మే 28న సినిమా విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రవితేజ గురించి ఇండస్ట్రీవర్గాలలో పలు ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. అదే మాస్ రాజా నెక్స్ట్ సినిమా ఇదే అంటూ ఓవైపు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను గురించి కూడా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి బాలయ్య బిబి3 సినిమాతో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే.
ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది. బాలయ్య బోయపాటి కాంబోలో రానున్న హ్యాట్రిక్ సినిమా ఇది. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి.. రవితేజతో సినిమా చేస్తాడనే టాపిక్ ఇండస్ట్రీలో చర్చలకు తావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బోయపాటి ఆల్రెడీ రవితేజ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నాడట. అధికారిక ప్రకటన రాలేదు కానీ బడా నిర్మాత ప్రొడ్యూస్ చేస్తాడని టాక్ నడుస్తుంది. నిజానికి బోయపాటి డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసింది మాస్ రాజా భద్ర సినిమాతోనే. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమా తర్వాత ఇన్నేళ్ళైనా వీరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాలేదు. అందుకే ఈసారి రవితేజతో బోయపాటి కామెడీ కం మాస్ ఎంటర్టైనర్ రూపొందించే ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అలాగే వీరిద్దరి ప్రస్తుత సినిమాలు ఒకేరోజు అంటే మే 28న తలపడనున్నాయి. మరి ఈ కాంబోలో సినిమా ఉందా లేదా తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.