Begin typing your search above and press return to search.

నా భార్య‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ః ప్ర‌ముఖ న‌టుడు

By:  Tupaki Desk   |   1 April 2021 11:37 PM IST
నా భార్య‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ః ప్ర‌ముఖ న‌టుడు
X
త‌న భార్య‌, చండీగ‌ఢ్ బీజేపీ ఎంపీ కిర‌ణ్ ఖేర్ బ్ల‌డ్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నార‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. కిర‌ణ్ ఖేర్ ఆరోగ్యంపై ప‌లు పుకార్లు చ‌ర్చ‌లోకి వ‌స్తున్న నేప‌థ్యంలో.. వాటికి ముగింపు ప‌ల‌కాల‌నే ఉద్దేశంతోనే ఈ వివ‌రాలు వెల్ల‌డిచిన‌ట్టు అనుప‌మ్ ప్ర‌క‌టించారు.

''కిరణ్ మ‌ల్టిపుల్ మైలోమాతో బాధ‌ప‌డుతున్నార‌ని అంద‌రికీ తెలియ‌జేయాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌స్తుతం ఆమె చికిత్స పొందుతోంది. త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నా. ఆమె ఎంతో అదృష్ట‌‌వంతురాలు. అందుకే మీరంద‌రూ ఆమెను ఇంత‌లా ప్రేమిస్తున్నారు.'' అని ట్వీట్ చేశారు అనుపమ్ ఖేర్.ఇదిలా ఉండగా.. కిరణ్ ఖేర్ ఛండీఘడ్ నుంచి బీజేపీ ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు. తొలిసారిగా 2014లో గెలుపొందిన ఆమె.. 2019లోనూ విజయం సాధించి సత్తా చాటారు