Begin typing your search above and press return to search.
మరోసారి తెరపైకి బ్లాక్ బస్టర్ కాంబో..!
By: Tupaki Desk | 23 April 2021 4:00 PM ISTసౌత్ ఇండియన్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ ఈ ఏడాది 'అసురన్' సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ హీరోగా మాత్రమే కాకుండా ధనుష్ ఇటు తెలుగు అటు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరవుతున్నాడు. ఆల్రెడీ ధనుష్ రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అప్పటినుండి వరుసగా ధనుష్ నటిస్తున్న తమిళ సినిమాలన్ని తెలుగులో కూడా డబ్ వెర్షన్ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా ధనుష్ కర్ణన్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అసలే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నటువంటి హీరో డబుల్ హ్యాపీగా ఉన్నాడు.
ఓవైపు నేషనల్ అవార్డు దక్కిన ఆనందం మరోవైపు కర్ణన్ బ్లాక్ బస్టర్. ఈ డబుల్ ఆనందంతో తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు ధనుష్. కర్ణన్ సినిమా డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలోనే మరో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 'కర్ణన్ బ్లాక్ బస్టర్ తర్వాత నేను మారి సెల్వరాజ్ మరోసారి కలిసి మరో సినిమా చేయబోతున్నాం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది షూట్ ప్రారంభం అవుతుందని చెప్పడానికి చాలా అనందంగా ఉంది' అంటూ ధనుష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఈ విషయం తెలిసి ధనుష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ధనుష్ ప్రస్తుతం ఆత్రంగిరే, కార్తీక్ నరేన్, సెల్వరాఘవన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.