Begin typing your search above and press return to search.
'తగ్గేదే లే'.. 200 కోట్ల క్లబ్ లో 'పుష్ప: ది రైజ్'..!
By: Tupaki Desk | 24 Dec 2021 8:00 PM IST'ఆర్య' 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళు సాధిస్తోంది.
'పుష్ప: ది రైజ్' మూవీ మూడు రోజుల్లోనే రూ. 173 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో, ఓవర్సీస్ లో కూడా హవా నడుస్తోందని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్ వీక్ లోవరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ సినిమా రూ. 229 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు.
'పుష్ప' మొదటి భాగం 2021లోనే బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా అని.. రెండోవారంలోకి ఘనంగా అడుగుపెట్టిందని నిర్మాతలు పేర్కొన్నారు. అలానే యూఎస్ఏ మార్కెట్ లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ మరో పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ ఏడాది ఈ స్థాయి వసూళ్ళు అందుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ అని వెల్లడించారు.
కాగా, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో 'పుష్ప: ది రైజ్' సినిమా తెరకెక్కింది. ఇందులో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్.. అభిమానులతో ఈలలు వేయించారు. బన్నీ ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక మందన్నా నటించింది. ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ - అజయ్ ఘోష్ - అజయ్ - శత్రు - జగదీశ్ - ధనుంజయ - శత్రు కీలక పాత్రలు పోషించారు.
'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ నిర్మించారు. ముత్తం శెట్టి మీడియా నిర్మాణంలో భాగం పంచుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. రెండో భాగాన్ని ''పుష్ప: ది రూల్'' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్ట్-2 ను సెట్స్ మీదకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.