Begin typing your search above and press return to search.
కరోనా డేస్ లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన నితిన్...!
By: Tupaki Desk | 18 April 2020 4:00 AM ISTకరోనా డేస్ లో నితిన్ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసాడు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తుంటే నితిన్ రికార్డ్ క్రియేట్ చేయడమేంటని ఆలోచిస్తున్నారా. అయితే ఇప్పుడు మనం ఆ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో రిలీజై హిట్ అయిన సినిమాల్లో 'భీష్మ' ఒకటి. ఈ సినిమాలో నితిన్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే కరోనా మహమ్మారి వచ్చి ఈ సినిమా లాంగ్ రన్ పై దెబ్బేసింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు, మల్టీప్లెక్సులు మూతపడ్డాయి. ఇక రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. లాక్ డౌన్ టైమ్ కి 'భీష్మ' చాలా థియేటర్స్ లో ఫుల్ రన్ తో ఉంది. దీన్ని బట్టి చూస్తే థియేటర్స్ మూసి వేసినా ఆన్ పేపర్ పలానా థియేటర్ లో భీష్మ ప్రదర్శించబడుతున్నట్లే లెక్క. ఈ ప్రకారం చూస్తే 'భీష్మ' ఆల్రేడీ 50 డేస్ కంప్లీట్ చేసుకున్నట్లే.
ఇక ఇది పక్కడ పెడితే నితిన్ నెక్ట్ మూవీగా 'రంగ్ దే' తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే 'రంగ్ దే' జూలై లో రిలీజ్ అవ్వాలి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడి రిలీజ్ కూడా ముందుకు వెళ్లి పోయింది. దీంతో లాక్ డౌన్ ఎత్తేసి ఈ సినిమా షూటింగ్ మొదలై అంతా రెడీ అయ్యే సరికి అక్టోబర్ అవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ దసరాకు ఉండే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే నితిన్ పంట పండినట్టే అనుకోవచ్చు. దసరా పండగ టైమ్ కి పరిస్థితి అంతా సర్దు మణిగే అవకాశం ఉంది కాబట్టి.. అలానే ఫెస్టివల్ సీజన్ ఫెచ్చింగ్ ఉండంటో 'రంగ్ దే' యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా సక్సెస్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.