Begin typing your search above and press return to search.

బాహుబలి-2 పైరసీ..15 లక్షలు డిమాండ్

By:  Tupaki Desk   |   17 May 2017 8:53 AM GMT
బాహుబలి-2 పైరసీ..15 లక్షలు డిమాండ్
X
సినిమాను పైరసీ చేసి.. దాన్ని సీడీలేసి అమ్ముకునే వాళ్లున్నారు. అలాగే పైరసీ వెబ్ సైట్లో పెట్టి సొమ్ము చేసుకునే వాళ్లూ ఉన్నారు. కానీ సినిమాను పైరసీ చేశాం.. మేం అడిగినంతా ఇవ్వకుండా ఆన్ లైన్లో రిలీజ్ చేస్తాం అని నిర్మాతనే నేరుగా బెదిరించే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలో ఇలాగే జరిగింది. ‘బాహుబలి’ హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ను ఇలా బెదిరించిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో ఈ సినిమా పైరసీ వెర్షన్లు బయటికి వచ్చేశాయి. అవి మొబైళ్లలో హల్ చల్ చేస్తున్నాయి. అక్కడక్కడా పైరసీదారులపై దాడులు జరిపి వాళ్లను అరెస్టు చేస్తున్నారు పోలీసులు.

కాగా బీహార్లోని ఓ థియేటర్లో దర్జాగా ‘బాహుబలి-22 హిందీ వెర్షన్ ను పైరసీ చేసిన ఓ ముఠా.. ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ కు శాంపిల్ వీడియో పంపి.. తమకు రూ.15 లక్షలు ఇవ్వకుంటే దీన్ని ఆన్ లైన్లో పెట్టేస్తామంటూ బెదిరించింది. ఐతే కరణ్.. బాహుబలి నిర్మాతలు ఈ బెదిరింపులకు లొంగకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ పైరసీ గ్యాంగ్ లోని ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగును దివాకర్ కుమార్ అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్ మొత్తం హైదరాబాదుకు చెందిన వాళ్లే కావడం గమనార్హం. జూబ్లీ హిల్స్ పోలీసులు ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుున్నారు. వారి దగ్గరున్న పైరసీ సీడీలను.. వీడియో క్యాప్చరింగ్ ఎక్విప్ మెంట్ ను స్వాధీనం చేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/