Begin typing your search above and press return to search.

యూఎస్ బాక్సాఫీస్.. బ్లాక్ పాంథర్ సాలీడ్ రికార్డ్

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:04 AM GMT
యూఎస్ బాక్సాఫీస్.. బ్లాక్ పాంథర్ సాలీడ్ రికార్డ్
X
కరోనా కష్టకాలం తర్వాత సినిమా ఇండస్ట్రీలు నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రపంచం మార్కెట్ ను మళ్లీ తన అస్తగతం చేసుకోవాలి అని గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. అయితే హాలీవుడ్ నుంచి ఇంతవరకు ఆశ్చర్య పరిచే రేంజ్ లో అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ రాలేదు. సూపర్ హీరోలు అందరూ కూడా కొంత అప్సెట్ అయ్యేలా చేస్తున్నారు.

ఒక విధంగా ఆడియన్స్ ఆలోచన విధానం కూడా మారడంతో కంటెంట్ అంతకుమించి అనేలా ఉంటేనే థియేటర్లోకి వచ్చి వీక్షిస్తున్నారు. ఇక యు ఎస్ మార్కెట్లో కూడా హాలీవుడ్ సినిమాల ప్రభావం కొంత తగ్గుతోంది అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో చాలా కాలం తర్వాత ఒక సినిమా మంచి కలెక్షన్స్ అందుకోవడం కొంత సంతోషాన్ని కలిగిస్తుంది. ఎట్టకేలకు బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ రాకతో బాక్సాఫీస్ కు ఊపొచ్చింది.

ఆ మధ్య వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ $187 మిలియన్ రికార్డును అధిగమించి, వకాండ ఫరెవర్ హాలీవుడ్ ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లలో ఈ సంవత్సరం అతిపెద్ద గ్రాసర్‌ గా నిలిచింది. ఇక వాకండ ఫరెవర్ ఫస్ట్ వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా $200 మిలియన్లకు పైగా వసూలు చేయగలదని ఇప్పుడు అంచనా వేయబడింది. వాస్తవానికి ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్ద ఫస్ట్ డే ఓపెనింగ్.

బాక్సాఫీస్ వద్ద తొలిరోజు 80 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంది. మొదటి భాగం, బ్లాక్ పాంథర్ $202 మిలియన్లు సంపాదించగా ఇప్పుడు ఈ సినిమా మరో $200 మిలియన్స్ కు పైగా రాబట్టవచ్చు. ఇక హాలీవుడ్‌లో 2022లో ఓపెనింగ్స్ లో $200 మిలియన్స్ అందుకున్న సినిమా రాలేదు. వీకెండ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మొదటి చిత్రం వకాండ ఫరెవర్ కావచ్చు. ఇక డిసెంబర్ 16న అవతార్: ది వే ఆఫ్ వాటర్ వరకు ఈ చిత్రానికి ప్రముఖ మల్టీప్లెక్స్‌లు పెద్ద స్క్రీన్‌లలో పోటీ లేదు. ఇక అవతార్ మాత్రం అంతకుమించి అనేలా రికార్డులను క్రియేట్ చేయగలదని చెప్పవచ్చు.