Begin typing your search above and press return to search.

బ్లాక్ పాంథ‌ర్ కి మార్వెల్ ఘ‌న‌మైన నివాళి!

By:  Tupaki Desk   |   24 July 2022 9:31 AM GMT
బ్లాక్ పాంథ‌ర్ కి మార్వెల్ ఘ‌న‌మైన నివాళి!
X
వ‌ర‌ల్డ్ వైడ్ మార్వెల్ మూవీస్ ఖ్యాతి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మార్వెల్ కామిక్ యూనివ‌ర్శ్ లో తెర‌కెక్కిన అమెంజ‌ర్ సినిమాల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ సిరీస్ అంటే ప్ర‌త్యేక‌మైన క్రేజ్. మార్వెల్ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటేనే? అంచ‌నాలు పీక్స్ లో ఉంటాయి. వ‌ర‌ల్డ్ వైడ్ మార్కెట్ పై మార్వెల్ వేసిన బ్రాండ్ అది.

అందుకే ప్రేక్ష‌కాభిమానుల్లో అంత క్రేజ్. సూప‌ర్ హీరో మూవీస్ లో రిలీజ్ అయిన బ్లాక్ పాంథ‌ర్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌ర‌ల్డ్ వైడ్ రికార్డు వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ నే షేక్ చేసిన చిత్ర‌మ‌ది. ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌కు ప్ర‌త్యేకమైన గుర్తింపు ద‌క్కింది. తాజాగా `బ్లాక్ పాంథర్` కి సీక్వెల్ గా గా `వాకాండా ఫారెవ‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేస్తోంది. ట్రైల‌ర్ తోనే సినిమాపై ఓ ఊపును తీసుకొచ్చారు. హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌నే త‌ల‌ద‌న్నతుంద‌న్న‌ అంచనాలు అప్పుడే మొద‌లైపోయాయి. న‌వంబ‌ర్ 11న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే..

ఈ సినిమా ట్రైల‌ర్ తో బ్లాక్ పాంథ‌ర్ లో న‌టించిన చాడ్ విక్ బోస్ మ్యాన్ కి ఘ‌న‌మైన నివాళి ద‌క్కింది. చాడ్ విక్ గ‌తేడాది క్యాన్స‌ర్ తో మృతి చెందారు. ఆయ‌న్ని గుర్తు చేస‌కుంటూ..చాడ్ విక్ కి ఘ‌న నివాళీగానే ఈ ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చాడ్ విక్ మొద‌టి భాగంలో బ్లాక్ పాంథ‌ర్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పాత్ర‌కు ఎంతో గుర్తింపు ద‌క్కింది.

వర‌ల్డ్ వైడ్ గా అభిమానులు ఏర్ప‌డ్డారు. బ్లాక్ పాంథ‌ర్ అంత పెద్ద స‌క్సెస్ అయిందంటే చాడ్ విక్ పెర్పార్మెన్స్ కీల‌క పాత్ర పోషించ‌ద‌ని చెప్పాలి. అందుకే ఇప్పుడాయ‌నికి నివాళులు అర్పిస్తూ ట్రైల‌ర్ తో ముందుకొచ్చారు. యూ ట్యూబ్ లో ఈ ట్రైల‌ర్ కి కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర్యాన్ కూగ్ల‌ర్ చాడ్ విక్ ని స్మ‌రించుకుని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. హాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో చాడ్ విక్ ప్ర‌భావం ఎప్పుడూ ఉంటుంద‌న్నారు. ట్రైల‌ర్ చూసి చాడ్ విక్ ఫ్యాన్స్ ఎమోష‌న్ కి గుర‌వుతున్నారు.