Begin typing your search above and press return to search.

చ‌రిత్ర మార్చిన యుగ‌పురుషుడు

By:  Tupaki Desk   |   10 Oct 2018 10:00 AM IST
చ‌రిత్ర మార్చిన యుగ‌పురుషుడు
X
100కోట్లు అన్న మాటే విన‌డానికి లేని స‌న్నివేశం. అస‌లు టాలీవుడ్ ఆ మార్క్‌ ని ఎప్ప‌టికి అందుకుంటుందో అంటూ ఆవేద‌న క‌నిపించేది. మ‌హా అయితే 80కోట్ల వ‌సూళ్లు.. అంత‌కుమించ‌డం అన్న‌ది 85ఏళ్ల తెలుగు సినిమా హిస్ట‌రీలో ఇదివ‌ర‌కూ లేనేలేదు. అయితే అలాంటి చోట 100 కోట్లు - 500కోట్లు - 1000కోట్లు - 1500కోట్లు - 2000కోట్లు .. అంత‌కుమించి వ‌సూళ్లు తెచ్చే సత్తా ఉంది మ‌న‌కు అని ప్రూవ్ చేస్తే.. అత‌డిని ఏమ‌నాలి? లెజెండ్ అన‌డానికి నామోషీ అయితే చ‌రిత్ర మార్చిన యుగ‌పురుషుడు అంటే త‌ప్పేం కాదు.

ఓవైపు కాపీ క్యాట్ డైరెక్ట‌ర్ అంటూ ముద్ర వేశారు. ముద్ర కాదు తూట్లు పొడిచారు. సీన్లు కాపీ చేస్తాడ‌ని - పోస్ట‌ర్లు కాపీ చేస్తాడని - క‌థ‌లు కాపీ చేస్తాడ‌ని ర‌క‌ర‌కాలుగా సూటి పోటి మాట‌లు ఎదుర్కొన్నాడు. అయితే అవేవీ స‌క్సెస్‌ ని ఆప‌లేదు. స‌రిక‌దా .. ఇత‌ర ప్ర‌పంచం త‌న‌ని చూసి నేర్చుకునేలా చేయ‌డం ద్వారా తానెంత‌టి ధీరుడో చూపించాడు. బాలీవుడ్‌ లో త‌ర‌ణ్ ఆద‌ర్శ్ అంత‌టివాడే త‌మ ఇండ‌స్ట్రీ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు - హీరోల‌కు ఓ సూచ‌న చేశారు. ``బాహుబ‌లిని - ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని చూసి నేర్చుకోవాలి. బాహుబ‌లి మార్కెటింగ్ స్ట్రాట‌జీని మ‌నం అనుస‌రించాలి. ఇదో గొప్ప పాఠం. నేర్చుకుని తీరాల్సిన పాఠం`` అంటూ త‌న ట్విట్ట‌ర్ ద్వారానే బ‌హిరంగ ప్ర‌పంచానికి చెప్పాడు. మ‌రి దీనిని ఏమ‌నాలి? కాపీ క్యాట్ డైరెక్ట‌ర్ అని తీసిపారేయాలా? ఇప్పుడు రాజ‌మౌళి తీసే సినిమా ఏది? ఆ సినిమా కోసం కేవ‌లం స‌గ‌టు ప్రేక్ష‌కుడే కాదు - బాలీవుడ్ సైతం ఎదురు చూస్తోంది. ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌లో ప‌రిశీల‌న‌గా చూస్తున్నాయి. క్రేజు అంటే అదీ అని ప్రూవైంది. అయినా ఇంకా ఈగోనా? ఉంటే ఉండొచ్చు కానీ - స‌క్సెస్ ఎవ‌రు అందిస్తే వాళ్లే మొన‌గాడు అని అంగీక‌రించాల్సిన త‌రుణం వ‌చ్చింది మ‌రి!

100కోట్ల క్ల‌బ్ కోసం మొహం వాచిన టాలీవుడ్‌ ని 1700 కోట్లు - అంత‌కుమించి తీసుకెళ్లిన ఘ‌న‌త మీకే ద‌క్కింది. అందుకు హ్యాట్సాఫ్‌. బాహుబ‌లితో ప్ర‌పంచానికే పాఠం నేర్పించి, ముఖ్యంగా మేమే గొప్ప అని విర్ర‌వీగే బాలీవుడ్‌ కి పాఠం నేర్పించిన ఘ‌న‌త మీకే ద‌క్కింది. రాజ‌మౌళి వేసిన బాట‌లో వెళుతున్న ఇరుగుపొరుగు సినీప్ర‌పంచం.. స‌రికొత్త‌ మార్కెటింగ్ స్ట్రాట‌జీతో కొత్త పుంత‌లు తొక్కుతోంది. స్టార్ హీరో ఏం క‌ర్మ‌ - మామూలు హీరోకి అయినా బిజినెస్ పెరిగింది. అందుకే జ‌క్క‌న్న‌కు హ్యాట్సాఫ్‌. నేడు రాజ‌మౌళి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌ డేట్ వ‌స్తుందేమో చూడాలి.