Begin typing your search above and press return to search.

ఫస్ట్ గ్లిమ్స్: 'లెఫ్టినెంట్ రామ్' కు బర్త్ డే విషెస్..

By:  Tupaki Desk   |   28 July 2021 10:50 AM IST
ఫస్ట్ గ్లిమ్స్: లెఫ్టినెంట్ రామ్ కు బర్త్ డే విషెస్..
X
'మహానటి' చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు 'మహానటి' నిర్మాతలతో కలసి హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’ వంటి మనసుని హత్తుకొనే సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఓ సినిమాలో నటిస్తున్నారు. గతేడాది దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

లెఫ్టినెంట్ రామ్.. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అంటూ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు (జులై 28) దుల్కర్ బర్త్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ గ్లిమ్స్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే.. ఈ మూవీ వార్ నేపథ్యంలో హను రాఘవపూడి శైలిలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 1960స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు అర్థం అవుతోంది. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపిస్తున్నారు.

'మహానటి' 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన స్వప్న సినిమాస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.7 గా దుల్కర్ సల్మాన్ మూవీ తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తారు. దుల్కర్ క్రేజ్ ని ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళ తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.